రష్మిక మందన్నా కు కాల్ చేసి సారీ చెప్పిన శ్రీ లీల.. అంత పెద్ద తప్పు ఏం చేసిందంటే..?

రష్మిక మందన్నా.. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్. నేషనల్ క్రష్ …అందాల ముద్దుగుమ్మ.. పాన్ ఇండియా బ్యూటీ .. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్ ..ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో .. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ ఎలాంటి స్థానంలో ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే .

పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉంది. ఈ ఒక్క సినిమా హిట్ అయినా చాలు రష్మిక మందన్నా పేరు గ్లోబల్ స్థాయిలో మారుమ్రోగిపోతుంది . అలాంటి రష్మిక మందన్నాకు శ్రీ లీల కాల్ చేసి సారీ చెప్పిందట . ప్రజెంట్ ఈ న్యూస్ కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. రష్మిక మందన్నా.. శ్రీ లీల మధ్య వార్ జరుగుతున్నట్లు గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

అందరినీ ఫాలో అయ్యే శ్రీ లీల ఇన్స్టాగ్రామ్ లో రష్మిక మందన్నాను మాత్రం ఫాలో అవడం లేదు అని .. మొదటి నుంచి రష్మిక అంటే శ్రీ లీలకు పడదు అని ప్రచారం జరిగింది . అంతేకాదు ఈ విషయం శ్రీ లీల వద్దకు వెళ్ళింది . దీంతో రష్మిక కు కాల్ చేసి సారి చెప్పిందట . ప్రత్యేకంగా ఏ ఉద్దేశ్యంతో అలా చేయలేదు అని.. పొరపాటున అది జరిగింది అని.. సారీ అక్క అంటూ రష్మిక మందన్నాకు స్పెషల్గా కాల్ చేసి సారీ చెప్పిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!