సిల్లీ రీజన్ తో సూపర్ డూపర్ హిట్ సినిమా వదులుకున్న మిల్కీ బ్యూటీ.. తమన్నా పెద్ద తలతిక్కలదే..?

తమన్నా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ .. మిల్కీ బ్యూటీ.. సెక్సీ ఫిగర్ ..అందాల ముద్దుగుమ్మ.. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో బిరుదులు వచ్చేస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో మిల్కీ బ్యూటీ తమన్నా.. ఎంత ఆక్టివ్ గా ఉంటుందో ఆమెకు రేంజ్ ఫాన్ ఫాలోయింగ్ ఉందో కూడా మనకు తెలుసు. అలాంటి తమన్న తల తిక్కలది అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు . సిల్లీ రీజన్ తో సూపర్ హిట్ సినిమాలు మిస్ చేసుకుంది అంటూ ఫైర్ అయిపోతున్నారు .

త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా నటించిన సినిమా ధమాకా. ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . శ్రీ లీల కెరీయర్ని నిలబెట్టి రవితేజను జనాల్లోకి మళ్ళీ తీసుకెళ్లిన మూవీ ఇదే. అయితే ఈ సినిమాలో మొదటిగా హీరోయిన్గా తమన్నాను అనుకున్నారట . కానీ ఆమె వరుసగా రవితేజ ఫ్లాప్ సినిమాలు పడ్డాయి అన్న కారణంతో ఈ సినిమా రిజెక్ట్ చేసిందట.

అమ్మడి అదృష్టమో దురదృష్టమో.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమా మిస్ చేసుకున్న తర్వాత మిల్కీ బ్యూటీ తమన్న చాలా ఫీల్ అయిపోయిందట. శ్రీలీల ప్లేస్ లో నేను ఉంటే డాన్స్ ఇరగ దీసేసి ఉండే దాన్ని అంటూ తెగ బాధ పడిపోయిందట . అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి అంటారు పెద్దలు అని ఫ్యాన్స్ ఆమెకు సజెస్ట్ చేస్తున్నారు . ప్రజెంట్ పలు వెబ్ సిరీస్ లతో సినిమాలతో బిజీగా ముందుకు వెళుతుంది తమన్నా . త్వరలోనే విజయ్ వర్మను పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!!