వెంకటేష్ కి బ్లాక్ బస్టర్ హిట్.. బాలయ్య కు మాత్రం ఫ్లాప్ ఇచ్చిన ఆ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?!

ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో సీనియ‌ర్ స్టార్ హీరోలుగా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య ఇప్పటికీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐదుప‌దుల‌ వయసు దాటినా ఇంకా యంగ్ హీరోలతో పోటీ ఇస్తున్న ఈ స్టార్ హీరోస్ ఏజ్‌తో సంబంధం లేకుండా రోజురోజుకు సినిమాలతో మరింత క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా చిరు బాలయ్య.. ప్రస్తుతం మాస్ ర్యాంపేజ్‌తో అదరగొడుతున్నారు. ఇప్పటికే బాలయ్య యాక్షన్స్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మాస్ ఇమేజ్‌తో బాలయ్య బిజీ హీరోగా దూసుకుపోతున్నాడు.

ఇదిలా ఉంటే ఒకప్పటి సీనియర్ స్టార్ హీరోయిన్ వెంకటేష్‌కు సూపర్ సక్సెస్ అందించి.. బాలయ్యకు మాత్రం భారీ ఫ్లాప్‌ మిగిల్చిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. కత్రినా కైఫ్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కెరీర్ స్టార్టింగ్ లో వెంకటేష్ హీరోగా.. విజయభాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మల్లీశ్వరి సినిమాకు హీరోయిన్‌గా నటించింది. కత్రినాకు ఇదే మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాతో వెంకటేష్ సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. కత్రినాకు కూడా మంచి పేరు వచ్చింది.

ఆ తర్వాత బాలయ్య బాబు హీరోగా నటించిన అల్లరి పిడుగు సినిమాలో కత్రినా హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. అయితే సినిమాకు మాత్రం ఊహించని రేంజ్ లో సక్సెస్ అందలేదు. బాలయ్య బాబు కెరీర్‌లోనే అది ఓ పెద్ద డిజాస్టర్ మూవీగా మిగిలిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఇద్దరు సీనియర్ హీరోల్లో ఒకరికి మాత్రం సూపర్ సక్సెస్‌ను ఇచ్చి మరొకరికి ఫ్లాప్ ని కత్రినా ఇచ్చిందంటూ నెటింట‌ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కత్రినా ఈ సినిమాల తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ సక్సెస్ సాధించి స్టార్ హీరోయిన్గా మారింది.