ఒకే డబ్బింగ్ ఆర్టిస్ట్ వల్ల సూపర్ హిట్ అయిన 12 సినిమాలు.. ఆ లిస్ట్ ఇదే..

టాలీవుడ్ స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ మూర్తి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. 1990లో టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ ప్రొఫెషన్ లో అడుగుపెట్టిన ఈయన కొంత కాలంలోనే తన టాలెంట్ తో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇంత మంచి టాలెంట్ ఉన్న ఈ ఆర్టిస్ట్ 2023 జనవరి నెలలో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. అతను చనిపోయిన విషయాన్ని చాలామంది సినీ ప్రముఖులు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు. చెన్నైలో గుండెపోటు కారణంగా చనిపోయిన శ్రీనివాస్ బతికున్న టైంలో మూడు వేలకు పైగా సినిమాల్లో డబ్బింగ్ చెప్పి.. కోట్లాదిమంది ప్రేక్షకులను తన వాయిస్‌తో మెప్పించాడు. తెలుగు మూవీస్ లో సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు అద్భుతమైన వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అయితే ఆయన డబ్బింగ్ వల్ల‌ సినిమాకి కొత్త కళ వస్తుందటంలో సందేహం లేదు. అలా కేవలం ఆయన డబ్బింగ్ వల్లే హిట్ అయినా 12 సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

హీరో సూర్య నటించిన సింగం.. 3 సిరీస్ సినిమాలకు శ్రీనివాస్ మూర్తి డబ్బింగ్ చెప్పారు. ఆయన డబ్బింగ్ చెప్పిన ఈ మూడు సినిమాలు ఎలాంటి రికార్డ్స్ సృష్టించాయో తెలిసిందే. అలాగే విక్రమ్ హీరోగా నటించిన అపరిచితుడు ఈ మూవీలో విక్రమ్ మూడు మాడ్యులేష‌న్స్‌లో కనపడతాడు. అయితే ఈ సినిమాకు కూడా శ్రీనివాస్ మూర్తి డబ్బింగ్ చెప్పారు. ఇక ఇప్పటికీ ఈ సినిమా బొల్లితెరపై ప్రసారమైతే ప్రేక్షకులందరు టీవీకి అతుక్కుపోతారు. ఆ రేంజ్‌లో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే విక్రమ్ హీరోగా.. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఐ సినిమాకు కూడా శ్రీనివాస్ డబ్బింగ్ అందించారు. ఈ సినిమాలో విక్రమ్‌కు డబ్బింగ్ చెప్పిన శ్రీనివాస్ మూర్తి వాయిస్‌కి ఎంతోమంది ఫిదా అయ్యారు. తమిళ్ హీరో అజిత్ ఇప్పటికే తెలుగు డబ్బింగ్ సినిమాల్లో చాలా సినిమాలు నటించాడు. అయితే దాదాపు వాటన్నింటికీ శ్రీనివాస్ మూర్తి డబ్బింగ్ చెప్పారు. ఇక అజిత్ హీరోగా నటించిన తెగింపు మూవీ కేవలం ఈయన డబ్బింగ్ వాయిస్ వల్లే హిట్ అయింది అనడంలో అతిశయోక్తి లేదు.

అలాగే మాధవన్ హీరోగా మణిరత్నం డైరెక్షన్ లో రూపొందిన‌ సఖి మూవీ లోను మాధవన్‌కు శ్రీనివాస్ డబ్బింగ్ అందించారు. ఈ సినిమా ఇప్పటికీ చాలామందిని ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో మాధవన్ వాయిస్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే కోలీవుడ్ హీరో సూర్య సైన్స్ ఫిక్షన్ మూవీ 24.. సినిమా సూర్య పాత్రకు వాయిస్ అందించింది.. ఆయనే. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూవీలో మలయాళ నటుడు మోహన్ లాల్ డబ్బింగ్ కూడా శ్రీనివాస్ మూర్తి చెప్పారు. అలవైకుంఠపురంలో యాక్టర్ జయరాం రోల్ కి శ్రీనివాస్ మూర్తి వాయిస్ అందించారు. రాజశేఖర్ గరుడవేగ మూవీలో రాజశేఖర్ పాత్రకు శ్రీనివాస్ వాయిస్ ఇచ్చారు. హాలీవుడ్ సూపర్ హిట్స్ ఐరన్ మాన్, జేమ్స్ బాండ్ సినిమాలో తెలుగు డబ్బింగ్కు శ్రీనివాస్ వాయిస్ అందించారు. రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులు బాగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ప్రశాంత్ వ‌ర్మ డైరెక్షన్లు తేజ సజ్జ హీరోగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న‌ హనుమాన్ మూవీ ట్రైలర్‌కు కూడా శ్రీనివాస డబ్బింగ్ అందించారు.