ఫస్ట్ టైం లవర్ ని స్టేజి పైకి తీసుకువచ్చిన ఇమ్ము.. వర్ష ముందే ప్రపోజ్..

బుల్లితెరపై ఎల్లప్పుడూ నవ్వులు పోయించే బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పుడు అద్భుతమైన స్కిట్లు చేస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించేందుకు ఈ షో ముందుంటుంది. ఇక ఇప్పటికే ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్ కమెడియన్లుగా క్రేజ్ సంపాదించుకొని మంచి పొజిషన్ లో దూసుకుపోతున్నారు. అలా ఈ షోతో భారీ పాపులారిటీ ద‌క్కించుకున్న కమెడియన్సులో ఇమ్మ‌నుయేల్ ఒకడు. సీరియల్ యాక్టర్స్ వర్షా తో లవ్ ట్రాక్‌లో స్కిట్స్ చేస్తూ అతి తక్కువ టైంలోనే సెలబ్రిటీగా మారిన ఇమ్మానుయేల్ తాజాగా తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేశాడు. ముఖ్యంగా తాను అమ్మాయిని ఎంతో కాలంగా ఇష్టపడుతున్నానని చెప్పుకొచ్చాడు. ఆమె క్యూట్ గా నవ్వేసి చివర్లో బ్యూటిఫుల్ లవ్ ప్రపోజల్ చేసింది.

Prema Kavali Promo | Immanuel & Varsha Special Show | Lambasingi Movie Team  | Bigg Boss Divi Vadthya - YouTube

ఈ షో మొత్తానికి ఆ ప్ర‌పోజ‌ల్‌ హైలైట్ గా నిలిచింది. ఇంతకీ ఆ విశేషాలు ఏంటో.. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందాం. జబర్దస్త్ షో ద్వారా లవ్ ట్రాక్‌ నడిపి విపరీతంగా పాపులారిటీ దక్కించుకున్నారు వర్ష, ఇమ్మానుయేల్ వీరిద్దరి గురించి అందరికీ తెలిసిందే. త‌మ‌కంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ ఏర్పరచుకున్న ఈ జంట.. ఇప్పటికీ లవ్ ట్రాక్ కొనసాగిస్తూ పలు షోల‌లో సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఇద్దరు యాంకర్లుగా మారి ప్రేమ కావాలి అనే షోను మొదలుపెట్టారు. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో గెస్ట్ ని తీసుకువస్తూ తెగ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కు లంబసింగి మూవీ టీం హాజరయ్యారు. ఇందులో హీరోయిన్గా నటించిన బిగ్బాస్ బ్యూటీ దివి వాద్త్యా తో పాటు హీరో భారత్ రాజ్ వచ్చి సందడి చేశారు. ఈ నేపథ్యంలో అదిరిపోయే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే ఇమ్ము వచ్చి దివిని చూస్తూ తెగ సిగ్గుపడ్డాడు.

Lambasingi (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

దివి నా క్రష్ అంటూ వివరించాడు. చాలా కాలంగా బిగ్ బాస్ దివిని ఇష్టపడుతున్నానని వివరించాడు. అయితే ఇదంతా విన్న దివికి ఏం చేయాలో అర్థం కాక ఇమ్ముని స‌ర‌దాగా చంప‌పై కొట్టింది. ఆ తర్వాత ఆమె కూడా మెలికలు తిరుగుతూ సిగ్గు పడిపోయింది. ఇక ప్రేమించడంలో అమ్మాయిలు గొప్పా.. అబ్బాయిలు గొప్పా.. అని ఆమెను ప్రశ్నించగా వీరిద్దరూ కలిసి చక్కగా ప్రేమించుకుంటూ.. ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ.. ఇద్దరు ఎదగడం గొప్ప అంటూ వివరించింది. దీంతో అంతా ఆమె డైలాగు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత దివి ప్రేమ గురించి ఓ సూపర్ డైలాగు చెప్పింది. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం.. నేను నీతో కలిసి బతకాలి అనుకుంటున్నా.. నువ్వు ఎలా ఉన్నా నాకు పర్లేదు.. నేనే నిన్ను చూసుకుంటా.. ఐ నీడ్ నథింగ్ ఫ్రమ్ యూ. ఐ లవ్ యు. నీకు కూడా ఇష్టం ఉంటే ఇద్దరం పెళ్లి చేసుకుందాం రా అంటూ వివరించింది. అయితే ఇది చెప్పిన ఈ డైలాగ్ సినిమాలోదా.. లేదా ఇమ్మానుయెల్‌కు ఫ‌న్నిగా చెప్పింద‌ తెలియాలంటే మాత్రం పూర్తిగా ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.