రష్మిక మందన్నా హీరోయిన్ కాకపోయి ఉంటే ఏం అవ్వాలనుకునిందో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..!!

మనం కెరియర్ పరంగా అనుకున్నది ఒకటి కెరియర్ కోసం ముందుకు వెళుతున్న పని ఒకటి.. చాలామంది తాము అనుకున్న గోల్ ని రీచ్ అవ్వలేరు. వందకి ఏ ఇద్దరో ముగ్గురో తాము అనుకున్న పనిని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లగలరు . సినిమా ఇండస్ట్రీలో చాలామంది కూడా ఇష్టం లేకుండానే బలవంతంగా ఇండస్ట్రీలోకి వచ్చిన సందర్భాలు మనం చూస్తుంటాం . రష్మిక మందన్నా కూడా అదే లిస్టులోకి వస్తుంది .

ఆమెకు మోడలింగ్ అంటే ఇష్టం.. అందుకే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. అయితే మొదటి నుంచి ఆమె ఎయిర్ హోస్టస్ అవ్వాలి అని ఆశపడిందట . ఫస్ట్ నుంచి ఆమెకు ఎయిర్ హోస్టెస్ అంటే చాలా చాలా ఇష్టమట . చక్కగా ఉంటారు.. స్టైలిష్ గా మోడరన్ గా మాట్లాడుతారు .. మరీ ముఖ్యంగా గాల్లో ఎగరొచ్చు అనే ఆశలు ఎక్కువగా ఉండేటివిట. అందుకే రష్మిక మందన ఎయిర్ హోస్టెస్ అవ్వాలి అని బాగా ట్రై చేసిందట.

కానీ సగంలో ఆమె కాన్సన్ట్రేషన్ మొత్తం సినిమాలపై మళ్లడంతో ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టింది . ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్నా.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను ఓకే చేస్తుంది. బిజీ బిజీగా ముందుకు దూసుకెళ్లిపోతుంది. ఒక్కొక్క సినిమాకి ఐదు నుంచి ఏడు కోట్ల రెమ్యూనిరేషన్ ఛార్జ్ చేస్తుంది. త్వరలోనే పుష్ప 2 తో చరిత్ర తిరగరాయబోతుంది..!