మహేష్ బాబు రిజెక్ట్ చేసిన స్టోరీ తో హిట్ కొట్టిన తరుణ్.. ఏ మూవీ అంటే..?

సినీ ఇండస్ట్రీలో ఓ హీరోను దృష్టిలో పెట్టుకొని.. డైరెక్ట‌ర్, రైట‌ర్‌ స్టోరీ రాయడం తర్వాత ఏవో కారణాలతో ఆ స్టోరీని ఆ హీరో తో కాకుండా మరో హీరోతో రూపొందించడం సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అలా డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ రాసిన ప్రేమ కథకు మహేష్ బాబు బాగుంటారని ప్రముఖ నిర్మాత సురేష్ దగ్గుబాటి వివరించాడట. అయితే మహేష్ బాబు దాన్ని రిజెక్ట్ చేయడంతో తన కథకు తగ్గ హీరోగా తరుణ్‌ని ఎంపిక చేసుకున్నాడు డైరెక్టర్ విశ్వనాథ్. ఈ సినిమా మరేదో కాదు నువ్వు లేక నేను లేను.

అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీలోనే బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. ఇక మహేష్ బాబు తో సినిమా చేసేందుకు ఇప్పటికీ చాలామంది డైరెక్టర్స్ క్యూ కడుతూ ఉంటారు. ఆయన డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరని కారణంగా చాలామందికి అవకాశం కూడా రాదు. అలా ఇప్పటికీ నాకు లేట్ అయింది.. ఆ క‌థ‌కి తరుణ్ అయితే సరిగ్గా సరిపోతాడు.. పైగా నువ్వే కావాలి సినిమాతో సక్సెస్ అందుకున్న తరుణ్ ఈ సినిమాకు పర్ఫెక్ట్ అంటూ సురేష్ బాబుకి.. మహేష్ కాల్ చేసి మరి చెప్పాడట.

ఈ విషయాన్ని కాశీ విశ్వ‌నాధ్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. జనవరి 14, 2022న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తరుణ్ హీరోగా, ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ఆర్పి పట్నాయక్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో ప్రతి పాట మంచి ఆధ‌ర‌ణ పోందింది. నచ్చావులే, రైడ్‌, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా లాంటి ఎన్నో సినిమాల్లో తండ్రి పాత్రలు పోషించు మెప్పించిన కాశీ విశ్వనాథ్.. కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించాడు. అలాగే కో డైరెక్టర్‌గా పని చేశాడు. నువ్వు లేక నేను లేను తొలిసారి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న ఆయన ఈ సినిమాతో సక్సెస్ సాధించాడు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా తొలిచూపులోనే సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.