“నాకు అది ఇవ్వవా..”.. పబ్లిక్ గానే విజయ్ దేవరకొండను అడిగేసిన రష్మిక మందన్నా..!

ఈ మధ్యకాలంలో రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండ విషయాలను ఎలా ప్రమోట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా రీసెంట్ విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది రష్మిక మందన్నా.. పరశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్ .

ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్గా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు . అయితే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు విజయ్ దేవరకొండ . పనిలో పని రష్మిక కూడా ఫ్యామిలీ స్టార్ కు ఫుల్ సపోర్ట్ చేస్తుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా రష్మిక మందన్నా.. ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఆల్ ద బెస్ట్ విషెస్ చెబుతూ ..”సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.. నాకు పార్టీ కూడా ఇవ్వాలి” అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.

దీనికి విజయ్ దేవరకొండ కూడా రెస్పాండ్ అయ్యాడు . “క్యూటెస్ట్” అంటూ కామెంట్ పెట్టాడు . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మొదటినుంచి విజయ్ దేవరకొండ సినిమాలకు రష్మిక మందన్నా.. రష్మిక మందన్నా.. సినిమాలకు విజయ్ దేవరకొండ సపోర్ట్ చేసుకుంటూ వస్తారు అన్న విషయం తెలిసిందే . కాగా ఇప్పుడు ఈ స్థాయిలో ప్రమోట్ చేసుకుంటూ ఉండడంతో అభిమానులు వీళ్ల మధ్య ఏదో ఉంది అంటూ గుసగుసలాడుకుంటున్నారు..!!