పూరి జగన్నాధ్ పెంట పని.. ఇప్పటికి మాట్లాడుకోని ఆ ఇద్దరి స్టార్ హీరోలు..ఏమైందంటే..?

కొన్నిసార్లు మనం మంచి చేయాలి అనుకున్న.. అది మనకి బౌన్స్ బ్యాక్ అవుతూ బ్యాడ్ గానే అవుతుంది . బహుశా పూరి జగన్నాథ్ విషయంలో అదే జరిగినట్లు ఉంది . ఆయన ఎప్పుడు ఏం చేయాలనుకున్నా సరే అది ఆయనకు బౌన్స్ బ్యాక్ అవుతూ నెగిటివ్ గానే పొట్రేట్ అవుతూ వస్తుంది. గతంలో ఆయన చేసిన తప్పుకి ఇప్పుడు అనుభవిస్తున్నాడు అంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు జనాలు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బిజినెస్ మ్యాన్..

మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా నటించాడు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమాలో మహేష్ బాబు చేత బూతు డైలాగులు చెప్పించడం అప్పట్లో సంచలనంగా మారింది . కాగా పూరి జగన్నాథ్ ముందుగా ఈ కథను కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో తెరకెక్కించాలి అని అనుకున్నాడట .. అదే విధంగా ఆయనకు కథ కూడా వివరించారట. సూర్య కూడా ఇంప్రెస్ అయ్యి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయడానికి సిద్ధమన్నారట.

అయితే ఈలోపే పూరి జగన్నాథ్ ఫ్రెండ్ వచ్చి కోలీవుడ్ హీరో కన్నా టాలీవుడ్ హీరో తో చేస్తే బాగుంటుంది అంటూ మహేష్ బాబుతో ఈ కథ చేయమంటూ బలవంతం చేశాడట. సరదాగా ట్రైల్ వేద్దామని మహేష్ బాబుకి కథ చెప్పగా .. ఆయన ఓకే చేసేసాడట . దీంతో మహేష్ బాబుకి కమిట్ అయిపోయి సూర్యకి హ్యాండ్ ఇచ్చాడు పూరి జగన్నాథ్ . అయితే అప్పట్లో ఈ విషయం కారణంగా మహేష్ బాబు సూర్య మధ్య పరోక్షక వార్ జరిగింది అంటూ వార్తలు వినిపించాయి..!!