రామ్ ” డబల్ ఇస్మార్ట్ ” లో ఛాన్స్ కొట్టేసిన మరో హీరోయిన్.. లక్కీ ఫెలో..!

టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న రామ్ పోతినేని గురించి మనందరికీ తెలిసిందే. ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ – డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో డబల్ ఇష్మార్ట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే..ఈయన నటించిన ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ కొట్టాడు.

ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్ కోసం అనన్య పాండేని ఈ సినిమాలో జాయిన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో లైగర్ బ్యూటీ సెలెక్ట్ అవడంతో ప్రతి ఒక్కరి ధ్యాస ఈ సినిమాపై మళ్లింది. అదేవిధంగా ఈ మూవీలో సంజయ్ దత్ కీలక పాత్రలో వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక పూరి మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి సీఈవోగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ఈ సినిమా తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టుకుంది. డబల్ ఇష్మార్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూద్దాం.