బాహుబలి సినిమా కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం ఏం చేశాడో తెలుసా? రియల్లీ గ్రేట్..!!

బాహుబలి ..తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన ఒకే ఒక్క పేరు. అప్పటివరకు తెలుగు సినిమాలు బాగా ఉంటాయి. అవి మనలను ఆకట్టుకుంటాయి అన్నవరకే తెలుసు ..ఒక తెలుగు డైరెక్టర్ కి ఇంత స్టామినా ఉందా..? ఇంత లోతుగా ఆలోచిస్తారా ..? ఇంత టాలెంట్ ఉందా..? అని ప్రూవ్ చేసిన ఏకైక సినిమా బాహుబలి అనే చెప్పాలి .

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి ఎంతో కష్టంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన మూవీ . పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన మూవీ కూడా ఇదే కావడం గమనార్హం . ఈ సినిమా కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడు ప్రభాస్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అయితే ఆ 100 కోట్లు కూడా ప్రభాస్ తన ఇష్టమైన ఫామ్ హౌస్ కోసమే ఖర్చు చేశాడట .

అప్పట్లో ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. మొదటి నుంచి ప్రభాస్ కి నేచర్ పిచ్చి .. ఫామ్ హౌస్ లో చుట్టూ చెట్లు ఉండాలి అని.. పక్షుల సౌండ్ వినిపించాలి అని బాగా కోరుకుంటాడు. అందుకే తన డ్రీమ్ ఫామ్ హౌస్ కోసం ఇష్టమైన బాహుబలి సినిమాకి వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తం ఖర్చు చేశాడట . ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. బాలయ్య హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ షోలో ఇదే విషయాన్ని పరోక్షకంగా బయట పెట్టేశాడు ప్రభాస్. ప్రెసెంట్ ఈ పాన్ ఇండియా హీరో కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . మే 9న ఈ సినిమా రిలీజ్ అవ్వాలి . అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది..!!