వెంకీ కోసం కత్తిలాంటి ఫిగర్ ను పట్టిన అనిల్ రావిపూడి.. ఏం టేస్ట్ రా బాబు ఇది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వెంకటేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన సినిమాలు ఏ విధంగా లేడీస్ ను ఆకట్టుకుంటాయో మనకి బాగా తెలుసు . తొడకొట్టి మీసాలు మేలివేసే హీరోస్ ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్న మూమెంట్లో ఆడవాళ్లను థియేటర్స్ కు రప్పించిన ఘనత కేవలం విక్టరీ వెంకటేష్ కే సాధ్యమైంది అని చెప్పడంలో సందేహం లేదు .

రీసెంట్గా ఆయన నటించిన సైంధవ్ సినిమా ఫ్లాప్ అయింది. అయినా సరే వెంకటేష్ ఏమాత్రం బాధపడలేదు . సినిమా అన్నాక హిట్ ఫట్ కామన్ .. మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి అనే టైప్ . కాగా రీసెంట్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు వెంకటేష్ అంటూ ప్రచారం జరుగుతుంది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరోసారి హీరోయిన్ తమన్నాతో రొమాన్స్ చేయబోతున్నాడట వెంకటేష్.

అనిల్ రావిపూడి – తమన్నా మంచి జాన్ జిగిడి దోస్తులు . గతంలో ఏదో వీళ్ళ మధ్య ఇష్యూ వచ్చింది అన్నారే కానీ అది అక్కడితోనే సాల్వ్ అయిపోయింది. ప్రజెంట్ తమన్న బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తుంది. బోల్డ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధపడుతుంది . పైగా వెంకటేష్ తో మంచి ర్యాపో కూడా తమన్నకు ఉంది . ఆల్రెడీ ఎఫ్2 ఎఫ్3 సినిమాల్లో నటించిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది . అందుకే ఈ సినిమాలో హీరోయిన్గా తమన్న ను చూస్ చూసుకున్నారట . తెరపై వెంకటేష్ – తమన్న ఫన్నీ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా మారిపోతున్నాయట . ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది..!!