కరంగాలి దండ ధరించాకే నా లైఫ్ మారింది.. సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ సెలబ్రిటీ..

చాలామంది సెలబ్రిటీస్ తమ మెడలో స్పటిక, రుద్రాక్ష లేదా కరంగాలి మాలలు వారి నమ్మకాన్ని బట్టి మార్చి ధరిస్తూ ఉంటారు. దాదాపు చాలామంది సినీ సెలబ్రిటీస్ ఈ నమ్మకాన్ని నమ్ముతూ ఉంటారు. అలాగే కోలీవుడ్‌కు చెందిన స్టార్స్ లోకేష్, ధనుష్, శివ కార్తికేయన్లు కూడా కరంగాలి దండను తమ మెడలో ఎప్పటికీ ధరించే ఉంటారు. అది మనం గమనించవచ్చు. ఇక వారు వేదికలపై మాట్లాడుతున్న సమయంలోనైనా ఈ ఈ దండలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అంతలా ఈ కరంగాలీ దండను వారు నమ్ముతూ ఉంటారు. గౌరవిస్తూ ఉంటారు. అది ఎందుకు ధరిస్తారో.. అనే విషయాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తాజాగా ఇంటర్వ్యూలో వివరించాడు.

కమల్ హాసన్ విక్రమ్ సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఓ ప్రమాదం జరిగిందని.. అప్పుడు నా మిత్రుడు ఆర్ట్ డైరెక్టర్ సతీష్ నాకు ఈ దండని ఇచ్చాడంటూ వివరించాడు. అప్పుడు ఈ మాల గురించి నాకు పెద్దగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదని.. కానీ ఈ దండం ధరించమని అతను చెప్పాడు కాబట్టి తీసుకున్నానని.. ఇక నీకు అన్నీ మంచే జరుగుతాయని అతను చెప్పాడని.. ఎలాంటి ప్రమాదం జరగదని వివరించాడని.. నాకు అలాంటి వాటి పట్ల నమ్మకం లేకపోయినా ఆయన కోరిక ఎందుకు కాదనడమని ద‌రించాన‌ని.. నిజంగానే ఆ సమయం నుంచి నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు.

విక్రమ్ సినిమా భారీ సక్సెస్.. ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. దీంతో ఈ దండన నేను ఎప్పుడు తొలగించాలనుకోలేదు అంటూ ఆయన వివరించాడు. ఇంతకీ ఈ కరంగాలి దండ అంటే జమ్మి చెట్టు కాండం నుంచి వ‌చ్చిన‌ దండ. జ్యోతిష్య శాస్త్రవేత్తలు కరంగాలిమాల అంగారక గ్రహానికి చెందిన గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి క‌లిగి ఉంటాయ‌ని.. అలాగే ఈ దండని ధరించడం వల్ల జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందని.. జ్యోతిష్య నిపుణులు చెబుతూ ఉంటారు. అలా ఈ దండకు ఇటీవల చాలా డిమాండ్ పెరిగింది దీంతో ఆన్లైన్లో డూప్లికేట్ మాలాలను కూడా అమ్మేయడం మొదలుపెట్టారు. అలాంటి వాటిని నమ్మడం వల్ల మంచి కన్నా చెడు ప్రభావమే ఎక్కువ జరుగుతుందట‌.

ఒరిజినల్ మాలను తమిళనాడులోని పాతాళ సంపు మురుగన్ ఆలయం దగ్గర మాత్రమే తీసుకోవాలని చాలామంది జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు. ఇక ఈ దండను రాత్రి నిద్రపోయే ముందు దేవుని గదిలో ఉంచి.. ఉదయం స్నానం చేసిన తర్వాత ధరించాలట. తమిళనాడులో సలైమలై కొండల దిగువన ఉన్న ఈ ఆలయం మధురై నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆలయంలో కొలువుదీరారు. ఇక ఈ కరంగాలి మాలను కోలీవుడ్ నుంచి శివ కార్తికేయన్, ధనుష్ కూడా ధరించి పలు సందర్భాల్లో కెమెరాకు చిక్కారు. ఓ ఇంటర్వ్యూలో ధనుష్ ఈ మాల గురించి మాట్లాడుతూ.. ఈ కరంగాలి మాల‌ ధరించిన తర్వాత నా లైఫ్ మారిపోయిందని.. సినిమాలు పరంగా ఎన్నో అవకాశాలు వచ్చాయంటూ వివరించాడు. చాలా సార్లు ఆలయానికి ధనుష్ కాలినడకన వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.