బుచ్చిబాబు సనా సినిమా ఎన్టీఆర్ నుంచి చరణ్ కి చేతులు మారడానికి కారణం ఆయనేనా..? ఫ్యాన్స్ కి ఎక్కడో మండిపోతుందిగా..!

మనకు తెలిసిందే .. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు .. ఇది జరుగుతుంది ..ఇది జరగదు అని మనం చెప్పలేము.. అలాంటివి స్టార్ లైఫ్ లో కూడా బాగా జరుగుతూ ఉంటాయి . ప్రజెంట్ బుచ్చిబాబు సనాకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . బుచ్చిబాబు సనా.. ఉప్పెన సినిమా ద్వారా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు . ఈ సినిమా రిలీజ్ అయి కొన్ని సంవత్సరాలు అవుతున్న .. సరే తన సెకండ్ సినిమాను రీసెంట్గా స్టార్ట్ చేశాడు.

నిజానికి ఉప్పెన సినిమా టైంలోనే బుచ్చిబాబు సన ఒక స్టోరీని రాసుకున్నాడట . ఆ స్టోరీకి ఎన్టీఆర్ అయితే దీ పర్ఫెక్ట్ అంటూ ఆయనకు కథ కూడా వివరించారట. మొదట ఓకే చెప్పిన ఎన్టీఆర్ ఆ తర్వాత స్క్రిప్ట్ లో చేంజెస్ చేయాలి అంటే చేశారట .. కొన్ని అనివార్య కారణాల చేత బుచ్చిబాబు సనా ఆ స్క్రిప్ట్ చేంజెస్ చేయడానికి ఇష్టపడలేదట. ఇదే విషయాన్ని సుకుమార్ కి వివరించగా సుకుమార్ ..ఈ కథ ఎన్టీఆర్ కన్నా చరణ్ కి బాగా సెట్ అవుతుంది అంటూ చరణ్ తెరకెక్కించమంటూ సజెస్ట్ చేశారట.

సుకుమార్ చెప్పడం కారణంగానే బుచ్చిబాబు సనా.. ఎన్టీఆర్ తో చేయాలి అనుకున్న ఈ సినిమాను చరణ్ తో చేయడానికి సిద్ధపడ్డాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ న్యూస్ తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు సుకుమార్ గా ఉన్నారు. మా ఎన్టీఆర్ ఖాతాలో పడాల్సిన సినిమాను చరణ్ ఖాతాలో పడేలా చేసావా ..? అంటూ ఫైర్ అయిపోతున్నారు..!!