ఓ మై గాడ్.. ప్రభాస్ వేసుకున్న ఈ సింపుల్ జాకెట్ కాస్ట్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..

టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తనదైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. గ్లామరస్ డ్రస్సులతో ఎప్పుడూ హైలెట్ గా నిలుస్తూ ఉంటాడు. మరోసారి తన స్టైలిష్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు ప్రభాస్. ప్రస్తుతం డార్లింగ్ వరస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ మారిన రెబ‌ల్ స్టార్ ప్రస్తుతం కల్కి 2898ఏడి సినిమా కోసం కీలక సన్నివేశాలు సూట్‌కోసం విదేశాలకు వెళ్ళాడు. ఇక ప్రభాస్ ఇప్పటికే సినిమా కోసం ఓ రొమాంటిక్ పాటను కూడా పూర్తి చేశాడు.

బాలీవుడ్ నటి దిశా ప‌ఠానీతో కలిసి ఇటలీలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నాడు. ఇటలీలో కల్కి సెట్స్ లో ప్రభాస్, దిశాపఠాని కలిసి ఉన్న ఫోటోలను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ పిక్ లో బార్బెర్రీ జాకెట్ ధరించి దర్శనం ఇచ్చాడు ప్రభాస్. ఈ జాకెట్ లో మరింత గ్లామరస్ గా స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ప్రభాస్ ధరించిన ఈ జాకెట్‌ ఎంత ధ‌ర‌ ఉంటుంది అని నెట్టింట‌ సెర్చింగ్‌లు మొదలుపెట్టారు అభిమానులు. ప్రస్తుతం దీని ధర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బ్లాక్ జాకెట్ కాస్ట్‌ దాదాపు రూ.76 వేలు ఉంటుందట.

ఈ వార్త వైరల్ అవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్రభాస్ రేంజ్ అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అడ్వెంచర్స్ థ్రిల్లార్‌గా రూపొందుతున్న కల్కి కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోస్ కీలకపాత్రలో నటిస్తున్నారు. మే 9, 2024న ఈ మూవీ రిలీజ్ కానుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని ధ‌త్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.