భుజంపై చేయి వేసి అసభ్యకరంగా చూశాడు.. డైరెక్టర్ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన స్టార్ నటి..

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వార్త‌లు ఎప్ప‌టినుంచో వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. మీటూ ఉద్యమంలో భాగంగా త‌మ జీవితంలో ఎదుర్కొన్న‌ చేదు అనుభవాలను ఇప్ప‌టికే ప‌లువురు నటి,నటులు ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. స్టార్ హీరోయిన్‌ల‌ దగ్గర నుంచి చిన్న స్థాయి నటీనటుల వరకు ప్రతి ఒక్కరూ తమ కెరీర్‌లో ఎదుర్కొన్న సమస్యల గురించి ఓపెన్ అప్ అవుతూనే ఉన్నారు. తాజాగా ఇదే అంశంపై బిగ్ బాస్ 16 కంటెంట్ బ్యూటీ శ్రీజిత దే మాట్లాడింది. ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి వివరించింది. ఓ సినిమా ఛాన్స్ కోసం డైరెక్టర్ దగ్గరకు వెళ్లానని.. అతడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ వివరించింది.

Bigg Boss 16 Weekend Ka Vaar: Sreejita De Evicted From Salman Khan's Show -  News18

17 ఏళ్లకే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాన నాతో ఎప్పుడూ మా అమ్మ తోడుగా ఉండేదని.. అమ్మ దగ్గర ఎప్పుడు ఏ విషయం దాచేదాన్ని కాదు అంటూ వివ‌రించింది. కానీ ఇండస్ట్రీలో కొంతమంది చెడ్డ మనుషులు మధ్య తిరగాల్సి వచ్చిందని.. ఛాన్సులపేరుతో, మీటింగ్‌ల పేరుతో ఆఫీసులకు పిలిపించి టైం పాస్ చేశార‌ని.. మరి కొంతమంది ఎలాంటి మొహమాటం లేకుండా కమిట్మెంట్ అడిగేసేవాళ్ళ‌ని చెప్పుకొచ్చింది. వీటన్నింటిలో నన్ను భయపెట్టిన సంఘటన ఒకటి ఉంది. ఓ సినిమా అవకాశం అంటూ డైరెక్టర్ పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పుడు అమ్మ నాతో లేదు. నేను సింగిల్‌గానే వెళ్లాల్సి వచ్చింది. సమయం చూసుకొని న భుజంపై చేయి వేసి నిమిరాడు.

Bigg Boss 16 evicted contestant Sreejita De calls Tina Datta's game 'lame  and stupid', comments on Sajid Khan's participation | Television News - The  Indian Express

నాతో మాట్లాడే విధానాన్ని బట్టి అతడి ప్రవర్తన ఎలాంటిదో.. అతని ఆలోచన, ఉద్దేశం ఏంటో అర్థమైంది. నా ప్లేస్ లో ఏ మహిళ ఉన్నా కూడా అతని ఉద్దేశం అదేనని క్లియర్ గా తెలుస్తోంది. నన్ను చూసిన తీరు అసహ్యంగా అనిపించడంతో నా పర్స్ పట్టుకొని అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసా అంటూ వివరించింది. ఇక శ్రీజిత కి బుల్లితెర‌పైనే కాకుండా సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నార్త్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. బెంగాలీ పాత్రల్లో వెలుగులోకి వచ్చి.. పలు టీవీ షో లలో సందడి చేసింది. తర్వాత బిగ్‌బాస్ అవకాశాన్ని అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ తర్వాత ఈమెకు ఎన్నో షోలలో అవకాశం లభించింది. దీంతో ఆమె భారీ పాపులారిటి దక్కించుకుంది.