ఠాగూర్ సినిమాకు సీక్వెల్ వస్తే.. ఈ ముగ్గురిలో ఏ హీరో సెట్ అవుతారు.. ఫ్యాన్స్ స్టాన్నింగ్ ఆన్సర్..!

ఠాగూర్ .. ఈ సినిమా పేరు చెప్తే మనకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. వివి వినాయక దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రేయ శరణ్- జ్యోతిక హీరోయిన్లుగా నటించిన సినిమా. అప్పటివరకు సినిమా ఇండస్ట్రీ ఒక ఎత్తు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ మరొక ఎత్తు అన్న స్థాయిలో ఈ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డులను బ్రేక్ చేసింది . ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో రికార్డులను సృష్టించింది .

మరిముఖ్యంగా చిరంజీవి అంటే కేవలం డాన్స్ యాక్టింగ్ అని మాత్రమే అనుకునే వాళ్ళ నోరు మూయించింది ఈ సినిమా . లంచం అనే ఓ మహమ్మారి సొసైటీలో ఎలా పాతుకుపోయిందో ..?కళ్ళకు కట్టినట్లు చూపించాడు వివి వినాయక్ . ఈ సినిమా ఇప్పటికీ చూసినా కూడా మనకి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఓ అద్భుతమైన పర్ఫామెన్స్ చూపించాడు చిరంజీవి . అయితే ఈ మధ్యకాలంలో గతంలో హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ వస్తున్న విషయం తెలిసిందే.

ఇదే క్రమంలో మెగా అభిమానులు చిరంజీవి ఠాగూర్ సినిమాకి సీక్వెల్ రావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు . అంతేకాదు కొందరు మెగా అభిమానులు ఈ సినిమాలో చిరంజీవి కాకుండా చిరంజీవి వారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తే ఇంకా ఇంకా బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు . అయితే చాలామంది ఈ పాత్ర కోసం చరణ్ కంటే అల్లు అర్జున్ బాగుంటారు అంటుంటే మరికొందరు వచ్చి ఎన్టీఆర్ ఆ రోల్ కి పర్ఫెక్ట్ అని ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ ఉన్నట్లు బన్నీ – చరణ్ డైలాగ్ డెలివరీ ఉండదు అని సజెస్ట్ చేస్తున్నారు. కొంతమంది మెగా ఫాన్స్ ఎన్టీఆర్ కూడా హీరోలకి బాగుంటాడు అని చెప్పడం గమనార్హం. మరి మీరు ఏమనుకుంటున్నారు..? ఈ పాత్రకు అల్లు అర్జున్ – చరణ్ – తారక్ ఎవరైతే బాగుంటారు..???? మీ ఆన్సర్ ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి..!!