10th క్లాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. మరి ఇంత దారుణంగా మారిందేంటి..

సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అంత యూత్ ఆకట్టుకునే కథలు ఎంచుకొని సక్సెస్ సాధించాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమాలకు చాలావరకు సక్సెస్ లభిస్తుంది. అలాంటి సినిమాల్లో ఒకప్పటి టెన్త్ క్లాస్ సినిమా ఒకటి. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. రొమాంటిక్ డ్రామాగా చందు డైరెక్షన్‌లో.. ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ శ్యాం ప్రసాద్ ప్రొడ్యూసర్‌గా ఈ మూవీ రూపొందింది. ఏ సినిమాలో భరత్, శరణ్య హీరో, హీరోయిన్లుగా నటించారు. మికీజే మేయర్ అందించిన సంగీతానికి.. ఈ సినిమాలో పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శరణ్య.. చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే నటించిన త‌న న‌ట‌న‌కు మంచి మార్కులు కొట్ఏసింది. అయితే ఈ శ‌ర‌ణ్య గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇంతకీ ఇప్పుడు ఈమె ఎలా ఉంది.. ఏం చేస్తుంది.. తెలుసుకోవాలని ఆశక్తి నెటిజన్లో మొదలైంది. సోషల్ మీడియాలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ చిన్ననాటి ఫొటోస్ నుంచి లేటెస్ట్ ఫోటోస్ వరకు వైరల్ అవుతూనే ఉంటాయి. అలా వారి చిన్ననాటి ఫొటోస్, ఓల్డ్ పిక్స్ ఏమైనా బయటకు వస్తే అవి క్షణాల్లో ఫ్యాన్స్‌ వైరల్ చేస్తూ ఉంటారు.

అలా కొంతమంది బిఫోర్, ఆఫ్టర్ అని తేడా లేకుండా ఎప్పుడు ఒకేలా కనిపిస్తూ ఉంటారు. మరి కొంత మంది మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోతారు. ఇప్పుడు టెన్త్ క్లాస్ బ్యూటీ శ‌రణ్య కూడా అదేవిధంగా కనిపిస్తుంది. అప్పటికి ఇప్పటికీ ఆమెకు అసలు పోలికే ఉండదు. బొద్దుగా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. అయితే తెలుగులో కొద్ది సినిమాల‌లో మాత్ర‌మే న‌టించిన ఈ బ్యూటీ తమిళ్‌లో ఎక్కువగా నటించింది. 2014 వరకు వరుసగా సినిమాల్లో నటించినా.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఎన్నో రకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో శరణ్య తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి.