అమ్మాయిలు అది పెంచుకుంటే ప్రభాస్ కి నచ్చదా..? అందుకే అలాంటి బ్యూటీస్ ని దూరం పెడతాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు . కానీ అందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తాడు ఈ రెబల్ స్టార్ ప్రభాస్ . ఒకటి కాదు రెండు కాదు చేతిలో ఇప్పుడు ఆరు ప్రాజెక్టులు పట్టుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు . రీసెంట్గా సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు .

ప్రజెంట్ కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ప్రభాస్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . ప్రభాస్ కి అమ్మాయిలు నెయిల్స్ పెంచుకుంటే అసలు ఇష్టం ఉండదట . మొదటి నుంచి ప్రభాస్ కి ఎందుకు ఎలర్జీ అట. తన చెల్లెలకి కూడా నెయిల్స్ పెంచుకోవద్దు అంటూ స్ట్రిక్ట్ గా చెప్పేస్తాడట. కానీ ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ పొడవుగా నెయిల్స్ పెంచుకొని నెయిల్స్ ఆర్ట్ అంటూ కొత్తగా ట్రెండ్ కూడా సెట్ చేస్తున్నారు .

అయితే ఎందుకో ప్రభాస్ కి అమ్మాయిలు గోర్లు పెంచుకుంటే అస్సలు నచ్చదట. అమ్మాయిలే కాదు అబ్బాయిలు అలానే పెంచుకున్న పరమ అసహ్యమట.. అలాంటి వాళ్ళని దూరం పెట్టేస్తాడట. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానుల కోరిక, అది ఎప్పటికి నెరవేరుతుందో ఎవ్వరికి తెలియడం లేదు..!!