ప్రభాస్ తో నటించిన ఈ హీరోయిన్స్ అందరిలోనూ ఆ క్వాలిటీ ఉంది గమనించారా.. వెరీ వెరీ రేర్..!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ .. ఒక్కొక్క రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . అయితే అందరికీ ఒకటే కోరిక రెబల్ స్టార్ ప్రభాస్ తో నటించాలి అని ..అది హిట్ హీరోయిన్ కాదు ఫ్లాప్ హీరోయిన్ కాదు ఎవరైనా సరే ప్రభాస్ తో నటించాలి అని ఆశపడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ ఆ ఛాన్స్ అందరికీ రాదు అనుకోండి . వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం హీరోయిన్స్ కి ఉన్న ప్రధాన లక్షణం . అయితే ప్రభాస్ తో నటించిన కొందరికి హీరోయిన్స్ లో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

త్రిష : ప్రభాస్ కి ఆన్ స్క్రీన్ బెస్ట్ పెయిర్ గా క్రేజ్ సంపాదించుకున్న త్రిష ఆయనకు ఎంత జాన్ జిగిడి దోస్తుగా ఉండేదో మనకు తెలిసిందే. అంతేకాదు వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే త్రిష చీట్ చేసిన కారణంగా ప్రభాస్ దూరం చేసుకున్నాడట . త్రిషకి యోగా అంటే మహా పిచ్చి .. రకరకాల యోగాసనాలు వేస్తూ ఉంటుంది
.


అనుష్క: టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క.. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానుల కల. అది ఎప్పుడు నెరవేరుతుందో అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది . అనుష్క శెట్టి కూడా యోగా టీచర్ ..యోగాసనాలు అంటే చాలా చాలా పిచ్చి.

శ్రద్ధ కపూర్ : ప్రభాస్ తో సాహో సినిమాలో నటించిన ఈ బ్యూటీ మంచి మార్కులు వేయించుకునింది. అంతేకాదు ప్రభాస్ కూడా పలు ఇంటర్వ్యూలలో ఓ రేంజ్ లో ఆమెను పొగిడేశారు . శ్రద్ధాకి కూడా యోగాసనాలు అంటే చాలా పిచ్చి . డైలీ క్రమం తప్పకుండా యోగా చేస్తుంది. అంతేకాదు తన ఫ్రెండ్స్ ని కూడా యోగా చేయమంటూ సజెషన్స్ ఇస్తూ ఉంటుంది.

దీక్ష సెధ్: ప్రభాస్ హైట్ కి బాగా మ్యాచ్ అయ్యే హీరోయిన్ . ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా కాలం హీరోయిన్గా సినిమాలు దక్కించుకున్న ఒక్కటంటే ఒక్క హిట్ అందుకోలేకపోయింది . ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది దీక్షా. ప్రభాస్ తో కలిసి రెబల్ సినిమాలో నటించిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే దీక్షాసేధ్ కి కూడా యోగ అంటే చాలా చాలా పిచ్చి..!!