లాయర్ కావాలనుకుని యాక్టర్ గా మారిన ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది హీరో, హీరోయిన్లు అడుగుపెడుతూ ఉంటారు. అయితే వారిలో చాలామంది తమ విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకుని.. కొంత ఉద్యోగం అనుభవం సంపాదించుకున్న తరువాత న‌ట‌న‌పై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. ఒకవేళ ఇండస్ట్రీలో వారి ప్లాన్‌బెడిసికొట్టినా బ్యాక్ టు వ‌ర్క్‌ అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ప్రస్తుతం సినీ రంగంలో అడుగుపెట్టిన హీరోయిన్లు చాలా మంది ఉన్నత చదువులు చదువుకొని.. హీరోయిన్లుగా మారిన వారే ఉన్నారు. వారిలో డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ ఇలా ఏవో ఒక గ్రాడ్యుయేషన్స్ పొందిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా ఆ కోవకే చెందుతుంది. మొదట లాయర్ అవుదామని విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈమె.. చివరకు నటిగా ఇండస్ట్రీలో సెటిల్ అయింది.

Malvika Sharma (aka) Malavika Sharma photos stills & images

ఫోటోలో అమ్మ వీపుపై కూర్చుని స్టైలిష్ గా ఫోజులిస్తున్న ఈ పాపకు ముందే హీరోయిన్ అవుతానని తెలుసేమో.. అంతే అందంగా.. క్యూట్ గా స్టిల్స్ ఇచ్చింది. వైట్ గౌన్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ముంబై కి చెందిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం యువ హీరోల సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ఎవరో కాదు మాళవిక శర్మ. క్రిమినాలజీలో స్పెషలైజేషన్ చేసి.. లా పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ.. యాక్టింగ్ పై ఉన్న ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అక్కడి నుంచి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. మొదట పలు ప్రైవేట్ యాడ్స్ లో కనిపించింది. జియో మొబైల్, హిమాలయ హెర్బల్ ఫేస్ వాష్, మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇలా యాడ్స్ లో కనిపించిన ఈ అమ్మడు 2018లో రవితేజ నేల టికెట్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

नेला टिकट' बॉक्स ऑफिस कलेक्शन: रवि तेजा और मालविका शर्मा अभिनीत फिल्म ने यूएस में प्रीमियर के दौरान $32k की कमाई की | तेलुगु मूवी समाचार ...

ఆ తర్వాత యంగ్ హీరో రామ్ సరసన రెడ్ సినిమాలో ఆకట్టుకుంది. తమిళ్ ఇండస్ట్రీలోనూ ఎంట్రీ ఇచ్చి కాఫీ విత్ కాదల్ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం మ్యాచో మ్యాన్ గోపీచంద్ నటిస్తున్న భీమా మూవీ షూటింగ్లో బిజీగా గడుపుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మార్చి 8 రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమా లో విద్య అనే క్యారెక్టర్ లో నటిస్తుంది. ఈ సినిమాతో పాటే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మాళవిక. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న హరోం హర సినిమాలోని ఈమె నటించనుంది. జ్ఞాన సాగర్ ద్వారక డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతుంది. చేసినది అతి తక్కువ సినిమాలో అయినా.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఏది హిట్ టాక్ కొట్టిన ఈ అమ్మడు రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది అనడంలో సందేహం లేదు.