డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా లోపలికి వచ్చాడు.. ప్రొడ్యూసర్ అసలు బుద్ధి బయటపెట్టిన తెలుగు హీరోయిన్..?!

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అన్ని చోట్ల వినిపిస్తూనే ఉంది. హీరో, హీరోయిన్ల దగ్గర నుంచి.. క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు చాలామంది క్యాస్టింగ్ కౌచ్ పై రియాక్ట్ అవుతున్నారు. వారికి జరిగిన అనుభవాలను సోషల్ మీడియా వేదికగానో లేదా ఏదైనా ఇంటర్వ్యూలో నిర్మామాటంగా చెప్పేస్తున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం వారి కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని మంచి ఫామ్ లో ఉన్న టైంలో ఎప్పుడూ ఓపెన్ కావడం లేదు. అవకాశాలు తగ్గినప్పుడు.. ఫెయిడౌట్ అయిపోయిన సమయంలో.. వారు ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్నారు. దీంతో ఈ వార్తలు కూడా ప్రేక్షకుల్లోకి అంతగా వెళ్లడం లేదు. కేవలం నాలుగు రోజులు వినిపించే వార్తలు లాగే వైరల్ అవుతున్నాయి.. తప్ప వీటిపై ఎలాంటి చర్యలు ఎవరు తీసుకోవడం లేదు.

Actress Soumya Shetty Arrest: రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో బంగారం, నగదు చోరీ చేసిన సినీ నటి సౌమ్య శెట్టి.. అనంతరం గోవాలో జల్సాలు.. ఎట్టకేలకు పోలీసుల అరెస్టు ...

అంతా మళ్లీ వాటిని మర్చిపోతున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే ఇటీవల స్నేహితురాలు ఇంటిలో కేజీ దొంగతనం చేసి గోవాలో జల్సాలు చేస్తూ దొరికిపోయిన సౌమ్య శెట్టి.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అరెస్ట్ తో ఒక్కసారిగా ఈమెకు సంబంధించిన గతం తాలూకా వార్తలు అన్ని వైరల్ అవుతున్నాయి. ఈమె టాలీవుడ్‌లో ది ట్రిప్, యువర్స్ లవింగ్లీ.. సినిమాలలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆడక పోవడంతో ఈమెకు మంచి గుర్తింపు రాలేదు. ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌమ్య శెట్టి మాట్లాడుతూ సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లో డ్రస్ చేంజ్ కోసం రూమ్ కి వెళ్ళానని.. నా వెనక్కి ప్రొడ్యూసర్ వచ్చి ఘోరంగా ప్రవర్తించాడంటూ చెప్పుకొచ్చింది.

Actress Soumya Shetty Hot Navel Photos & Pics - Hot Actresses

ఆ సినిమా పూర్తయ్యే వరకు కూడా నన్ను అదేవిధంగా వేధించేవాడని.. అప్పుడప్పుడు చేయి చేసుకునేవాడని ఆమె తెలియజేసింది. సినీ పరిశ్రమంలో నేను ఉన్న అతి తక్కువ టైంలోనే ఎన్నో ఘోరమైన అవమానాలు ఎదుర్కొన్నాను అంటూ ఆమె వివరించింది. ఇక వైజాగ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ ఒడిస్సా.. సుజాతనగర్‌కు చెందిన బలరాంశెట్టిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా ఆఫర్లు దొరకకపోవడంతో ఇన్‌స్టాలో రిల్స్‌ చేస్తూ మరోపక్క సినిమాల కోసం ఆడిషన్స్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలో ఈమె స్నేహితురాలు ఇంట్లో దొంగతనం చేసి పట్టు పడడంతో వార్తల్లో తెగ వైరల్ అవుతుంది. ఇకపై ఈమెకు సినిమా అవకాశాలు రావడం అనేది అసాధ్యం కాదంటూ నెటిజ‌న్స్‌ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.