“నేను కూడా దాని కోసమే ఎదురు చూస్తున్నా”.. మహేశ్ బాబు నోట అస్సలు ఊహించని మాట..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబుకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాం. మరీ ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయినప్పటి నుంచి ఆయనపై హ్యూజ్ ట్రోళింగ్ జరుగుతుంది. అయితే ఆయన తన తదుపరిచిత్రాన్ని దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో కమిట్ అయ్యాడు అని తెలిసినప్పటి నుంచి జనాలు ఓ రేంజ్ లో ఆయన సినిమాపై కాన్సెంట్రేషన్ చేయడం మొదలుపెట్టారు .

రీసెంట్గా ఓ ప్రముఖ జాతీయ పత్రికతో ముచ్చటించారు మహేష్ బాబు . ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలను బయటపెట్టారు . ” ఇటీవల నటించిన గుంటూరు కారం మూవీ కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంది . అది నాకు చాలా చాలా హ్యాపీ . ప్రజెంట్ అందరూ కూడా రాజమౌళి ప్రాజెక్టు గురించి వెయిట్ చేస్తున్నారు అని ..

నాకు తెలుసు మీలాగే నేను కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను.. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి ..ఈ మూవీ కోసం మీరు ఎంత ఎక్సైట్ గా ఉన్నారో .. నేను కూడా అంతే ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్న” అంటూ తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం కేవలం సామాన్య జనాలు ఫ్యాన్సే కాదు సినీ స్టార్ సెలబ్రిటీస్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఈ సినిమా కోసం అందరూ కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ కాచుకుని కూర్చుని ఉన్నారు..!!