” గామి ” నెగిటివ్ రేటింగ్ వివాదం.. లీగల్ యాక్షన్ తీసుకుంటా.. విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన మూవీ గామి. విద్యాధర్‌ కాగితపు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు కార్తీక్ శ‌బరీష్, శ్వేత ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. సినిమాపై మరింత హైప్‌ పెరిగింది. భారీ అంచనాల మధ్య మార్చి 8న‌ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే కొంతమంది ఈ సినిమాపై కావాలనే నెగటివ్ రివ్యూ ఇస్తున్నారంటూ ఇప్పటికే వివాదం మొదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంపై తాజాగా మూవీ టీమ్ స్పందించారు. గామి హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంటే.. కావాలనే కొంతమంది సోషల్ మీడియా వేదికను మిస్ యూజ్‌ చేసి నెగటివ్ రివ్యూస్ ఇస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఈ క్రమంలో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ ఓ సంచలన పోస్ట్ షేర్ చేశాడు. సినీ ప్రియులకు, ప్రేక్షకులకు గామి సినిమాను అద్భుతంగా సక్సెస్ చేసిన ప్రతి ప్రేక్షకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా. అయితే దీనిని బ్లాక్ బ‌స్ట‌ర్‌గా మార్చడానికి నేను ఎంతగానో కష్టపడ్డా.. నా వంతు కృషి చేశా.. కానీ కొన్ని టికెట్ బుకింగ్ ప్లాట్ఫారం లో రేటింగ్ విషయంలో నా దృష్టికి వచ్చిన సమస్య గురించి మాట్లాడాలని భావిస్తున్న. కొందరు కావాలనే ఫేక్ అకౌంట్స్ తో 10 రేటింగ్ 1 వచ్చేలా సినిమాను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు.. వాళ్ళు ఇచ్చే ఫేక్ రేటింగ్స్ వల్ల మూవీకి మంచి రేటింగ్స్ వచ్చిన అవి పడిపోతున్నాయి.

అలాంటి వాళ్ళు ఎన్నిసార్లు కిందకి లాగడానికి ప్రయత్నించినా.. నేను మళ్ళీ ధైర్యంగా పైకి లేస్తానని వివరించాడు. నా సినిమాను ఆదరించే ప్రతి ఒక్క ప్రేక్షకునికి నా కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చాడు. అసలైన ప్రేక్షకులు నిశ్చింతగా ఉన్నారు. ఈ విషయాన్ని పరిష్కరించడానికి లీగల్ యాక్షన్ తీసుకోనున్నాం. భం బోలే నాథ్.. జైహింద్ అంటూ రాసుకోచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెటింట‌ వైరల్ కావడంతో విశ్వక్ ఫ్యాన్స్ అంతా అతనికి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 22.5 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.