మొదట ఎన్టీఆర్.. ఆ తరువాత్ చరణ్.. జాన్వీ నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే..?

జాన్వి కపూర్ .. ఏ ముహూర్తాన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో తెలియదు కానీ ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంది . అంతా ఇంతా కాదు అమ్మడు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతుంది . ఎన్టీఆర్ దేవర సినిమాతో డెబ్యూ ఇవ్వబోతున్న ఈ బ్యూటీ ఇప్పటివరకు దేవర సినిమాకి సంబంధించి మూడు పిక్చర్స్ రిలీజ్ అయ్యాయి. మూడు పిక్చర్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి . అయితే ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే తెలుగులో రెండో సినిమా అవకాశం అందుకునింది .

చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయింది . కాగా మొదట ఎన్టీఆర్ తో రెండో సినిమా చరణ్ తో చేస్తున్న జాన్వి కపూర్ మూడో సినిమా బిగ్ స్టార్ హీరోతో చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఆయన మరెవరో కాదు అల్లు అర్జున్ . పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

దీంతో జాన్వీ కపూర్ ని ఇండస్ట్రీలో పొగిడేస్తున్నారు . నువ్వు మామూలు ముదురు కాదు తల్లి మీ అమ్మని మించిపోతావ్ అంటూ వెటకారంగా వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు. అంతేకాదు జాన్వి కపూర్ ఒక్కొక్క సినిమా కోసం ఐదు కోట్లు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తుందట . ఒక్క సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవ్వకుండానే అమ్మడు ఈ రేంజ్ లో డిమాండ్ చేస్తుంది అంటే ఇక ఈ సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీలో ఆమె ఏ రేంజ్ లో దున్నేస్తుందో అర్థం చేసుకోవచ్చు..!!