ప్రభాస్ సినిమాలలో అనుష్క మోస్ట్ ఫేవరెట్ ఏంటో తెలుసా.. గెస్ చేస్తే నిజంగా మీరు రెబెల్ స్టార్ రియల్ ఫ్యానే..!

సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ – అనుష్క ల పేర్లుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ..ఆరడుగుల అందగత్తె అనుష్క ..జతకడితే సినిమా సూపర్ డూపర్ హిట్టే.. బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ అనాల్సిందే . అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో అనుష్క హోస్ట్ ప్రశ్నిస్తూ ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు బాగుంటాయి . కానీ మీ మోస్ట్ ఫేవరెట్ సినిమా ఏది? ఈ సినిమాని మళ్లీమళ్లీ చూడాలి అని ఏ సినిమా గురించి అనుకుంటారు అని ప్రశ్నించగా అనుష్క సెకండ్ కూడా ఆలోచించకుండా బిల్లా సినిమా పేరును చెప్పుకొచ్చింది .

ప్రభాస్ – అనుష్క కాంబోలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది . ఈ సినిమాలో అనుష్క టూ బోల్డ్ గా కనిపిస్తుంది . అయినా సరే అనుష్కని అభిమానులు బాగా లైక్ చేశారు . వీళ్ళ కాంబోలో అలాంటి సీన్స్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోయారు. మరీ ముఖ్యంగా ఆ సినిమాలోని బొమ్మాలి సాంగ్ కుర్రాలను ఏ రేంజ్ లో ఊపేసిందో మనకు తెలిసిందే . అయితే అనుష్క చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది . ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ ఎలా చేయగలిగింది అంటూ అప్పట్లో బాగా చర్చించుకున్నారు .

అంతేకాదు చాలా ట్రెడిషనల్ గా ఉండే అనుష్క ఇంత బోల్డ్ క్యారెక్టర్ లో ఉన్న సినిమాను తన ఫేవరెట్ మూవీ అని చెప్పడం అభిమానులకు సైతం ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అయితే అలాంటిది ఏదీ లేదు అంటూ వాళ్లు పలు ఇంటర్వ్యూలలో ఓపెన్ గా చెప్పుకు వచ్చారు . కానీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది అభిమానుల కోరిక …చూద్దాం వీళ్ల కోరిక ఎప్పటికి నెరవేరుతుందో..??