నాని నెక్స్ట్ మూవీ రిలీజ్ పై క్లారిటీ వచ్చేసిందోచ్… ఎగిరి గంతేస్తున్న ఫ్యాన్స్..?

నాచురల్ స్టార్ నాని ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించారు. ఇక ఈయన టాలీవుడ్ లోనే మంచి పేరుని సంపాదించుకున్నారు. నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేమతో సరిపోదా శనివారం మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని ఆగస్టు 29న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇక దీని అనంతరం సుజిత్ తో ఇప్పటికే ఒక మూవీ కమిట్ అయ్యారు నాని. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు మూవీస్ ని డివివి ఎంటైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. వమొ లెంట్ మ్యాన్, నాన్ వయులెంట్ గా మారితే అని కాన్సెప్ట్ తో మాస్ యాక్షన్ డ్రామాగా సుజిత్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం దీని యొక్క షూటింగ్ త్వరలో ప్రారంభించి రానున్న డిసెంబర్లో పక్కాగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట.నాని కెరియర్ లో 32వ మూవీగా రూపొందుతున్న దీని అనౌన్స్ మెంట్ వీడియో ఇటీవలే రిలీజ్ అయ్యి అందరిని ఆకట్టుకుంది. త్వరలో ఈ మూవీ గురించి అప్డేట్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి.