గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న ” హనుమాన్ “.. ఓటిటి రికార్డుల వేట మామూలుగా లేదుగా..!

తేజ సజ్జ మనకి చిన్ననాటి నుంచే సూపరిచితం. ఇక తేజ తాజాగా హనుమాన్ సినిమా చేశాడు. హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చి రికార్డులను సృష్టించింది. బడా హీరోలా సినిమాలను పక్కకు నెట్టి మరి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మోత మోగించింది. అంతేకాకుండా 150 థియేటర్లో సక్సెస్ పులేగా 50 రోజులు పూర్తిచేసుకుని మరోరికార్డును అందుకుంది.

అయితే….అప్పటినుంచి ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తదా అని ఎదురు చూడని వారే లేరు. ప్రజల ఆరాటానికి తగ్గట్టుగానే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కూడా లేట్ అవుతూనే వచ్చింది. ఇక ఎట్టకేలకు ఆదివారం నుండి ‘హనుమాన్’ మూవీ జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక థియేటర్లలో సత్తా చాటిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియంలో కూడా దూసుకుపోతుంది. ఓటీటీ లోకి వచ్చిన కేవలం 11 గంటల్లోనే హనుమాన్ 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను నమోదు చేసింది.

దీనితో జి 5 లో ఇంతకు ముందున్న రికార్డులన్నిటిని బద్దలు కొట్టి కొత్త రికార్డులను సృష్టించింది. ఈ విషయాన్ని స్వయంగా జీ5 ఓటీటీ సంస్థ x వేదిక పంచుకుంది. ఈ మేరకు రికార్డులు బద్దలు అయ్యాయి..హృదయాలు గెలిచాయి. హనుమాన్ ఇప్పుడు ZEE5 లో తెలుగు, ఇంగ్లీషులో కూడా ప్రసారం అవ్వబోతుంది ‘ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దేనికి సంబంధించిన పోస్టులు వైరల్ కావడంతో.. ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో ఈ సినిమా అంటూ కామెంట్లో పెడుతున్నారు నెటిజన్లు.