దళపతి 69వ సినిమాని టేకప్ చేసిన స్టార్ డైరెక్టర్.. ఇక నుంచి బాక్స్ ఆఫీస్ దద్దరిల్లాల్సిందే..!

దళపతి విజయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈయన తన కెరీర్ 68వ సినిమాని దర్శకుడు వెనక్ట్ ప్రభుతో చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే టైటిల్ ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఇక దీనిపై అనేక అంచనాలు నెలకొన్నాయి.

ఇక విజయ్‌ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. విజయ్‌ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై మరిన్ని ఆశలు నెలకొన్నాయి. ఇక దళపతి నెక్స్ట్ సినిమాపై అనేక రూమర్స్ ఇప్పటికే వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తన కెరీర్ 69వ సినిమా ఎవరితో చేయనున్నారు అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దళపతి తన నెక్స్ట్ మూవీ ని దర్శకుడు ఆర్జె బాలాజీ తో చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ జె తెరకెక్కించిన అనేక సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య వచ్చే కాంబినేషన్ కూడా సూపర్ హిట్ అవుతుందని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు.