మహేష్ – రాజమౌళి మూవీపై క్రేజీ అప్డేట్.. ఎట్టకేలకు అలా..!

సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చిన ఈయన మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు. దీంతో మహేష్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

ఇక మహేష్ ప్రస్తుతం నటించబోయే మూవీ రాజమౌళితో ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి మరియు మహేష్ సినిమా మరికొన్ని నెలల్లో స్టార్ట్ కానుంది. వీరి సినిమాపై ఇప్పటికే అనేక అంచనాలు నెలకొన్నాయి. ఇక మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమాని పూజ కార్యక్రమాలతో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. నిజానికి మొన్నటి వరకు తెలుగు నూతన సంవత్సరమైనా ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

మరి ఈ రెండు తేదీల్లో ఏ తేదీ మేకర్స్ ఖరారు చేసుకున్నారు ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. ఇక తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తుంది. మహేష్ పుట్టినరోజు తేదీ అయిన ఆగస్టు 9నే ఈ సినిమా అధికారికంగా స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథా నేపథ్యం సాగునున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ కథ గురించి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. నేను మరియు రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల చరిత్ర విల్బర్ స్మీత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ను రాయబోతున్నాం.. అంటూ వెల్లడించారు.