విశ్వక్సేన్ ” గామి ” మూవీ సెన్సార్ కంప్లీట్.. కానీ చిన్న ట్విస్ట్..!

టాలీవుడ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి సాధారణంగా అడుగుపెట్టిన ఈయన మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం విశ్వక్సేన్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా డబ్ల్యు డైరెక్టర్ విద్యాధర్ దర్శకత్వంలో గామి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మంచి కంటెంట్ తో రూపొందుతున్న ఈ మూవీ పై ఇప్పటికే అనేక న్యూస్ వినిపించిన సంగతి తెలిసిందే. ఇక మరికొన్ని రోజుల్లో రాబోతున్న ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్తో కన్ఫర్మ్ చేశారు.

ఇక ఈ సినిమాలో కనిపించిన కంటెంట్ కి డిఫినెట్ గా యు ఏ సెన్సార్ సర్టిఫికెట్ ని చాలా మంది ఊహించవచ్చు కానీ ఊహించని విధంగా ఈ సినిమాకి సెన్సార్ యూనిట్ ఏ సర్టిఫికెట్ ని ఇవ్వడం ఆశ్చర్యం. ఇక ఈ సినిమాలో కూడా పెద్దలు మాత్రమే చూసే కంటెంట్తో వస్తుంది అని ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ మూవీ రిలీజ్ అనంతరం ప్రేక్షకులను ఎంత మేరా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.