బన్నీ కి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? లవ్ స్టోరీ ఫస్ట్ ఆమెకే చెప్పాడా..?

అల్లు అర్జున్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరో .. ఐకాన్ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . ఒక్కొక్క సినిమాకు 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు . త్వరలోనే పుష్ప2 సినిమాతో చరిత్ర తిరగరాయబోతున్నాడు . ఇలాంటి క్రమంలోనే బన్నీకి సంబంధించిన ఒక పర్సనల్ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారింది . అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . వీళ్ళ ప్రేమ – పెళ్లి వ్యవహారం అందరికీ తెలిసిందే .

తెరిచిన పుస్తకం అనే చెప్పాలి. అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి ని చూసి లైక్ చేశాడు . వెంటనే ప్రొపోజ్ చేశాడు. కానీ స్నేహ రెడ్డి మాత్రం కొంచెం టైం తీసుకునింది. అయితే ఎక్కడా కూడా ఈ లవ్ మేటర్ ను బయట పెట్టలేదు . అల్లు అర్జున్ ఫర్ ద ఫస్ట్ టైం సమంత హోస్ట్ చేసిన సామ్-జామ్ ప్రోగ్రాంలోనే బన్నీ స్నేహ రెడ్డిని ఎందుకు లవ్ చేశాడు అన్న విషయం ఓపెన్ గా చెప్పుకు వచ్చాడు.

“జనరల్ గా నైట్ పార్టీలు ..పబ్బులు అంటే ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ స్నేహ చాలా డిగ్నిటీ గల అమ్మాయి.. అక్కడ ఆమె కనిపించిన తీరు నాకు చాలా నచ్చేసింది ..ఆమె క్యారెక్టర్ ఇంకా ఇంకా నచ్చింది.. నాకు ఆమెకు అస్సలు పోలికలు లేవు ..కానీ ఆమె నాకు చాలా నచ్చింది ఇష్టపడ్డాను ..ఆమెను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం” అంటూ చెప్పుకు వచ్చాడు . దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సమంత అంటే ముందు నుంచి బన్నీకు స్పెషల్ ఫ్రెండ్షిప్ ఉందని .. ఆ కారణంగానే పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకున్నారు అని చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్..!!