ఆ హీరోయిన్ కి మాట ఇచ్చి.. లాస్ట్ లో హ్యాండ్ ఇచ్చిన బుచ్చి బాబు సనా.. తప్పు చేశావ్ బ్రో..?

ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణమే.. అలాగే ఒక హీరోయిన్ ని ఆ సినిమాలో హీరోయిన్ గా అనుకోని కొన్ని కారణాల చేత లాస్ట్ మూమెంట్లు ఆ హీరోయిన్ కి హ్యాండ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేశాడు.. డైరెక్టర్ బుచ్చిబాబు సన. ఆయన తెరకెక్కించింది ఒక్కటంటే ఒక్క సినిమానే .. అది కూడా సూపర్ డూపర్ హిట్ ..సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు సన ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.

ఒకటా రెండా ఈ సినిమా ఎన్ని అవార్డులను కొల్లగొట్టిందో మనకు తెలిసిందే. ఆ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని తెరకెక్కించిన సినిమా ఆర్సి 16. రామ్ చరణ్ కెరియర్ లో ఫస్ట్ టైం స్పోర్ట్స్ డ్రామాల్లో తెరకెక్కుతున్న మూవీ ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో ముందు నుంచి హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది అంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే .

ఫస్ట్ బుచ్చిబాబు సన ఈ ప్రాజెక్టు కోసం కొత్త బ్యూటీని లాంచ్ చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట . రవినా టండనా కూతుర్ని ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేసుకున్నారట . కానీ చిరంజీవి సలహా మేరకు బుచ్చిబాబు సన.. శ్రీదేవి కూతురైన జాన్వి కపూర్ ని ఈ సినిమాలో ఫైనలైజ్ చేసారట . ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మండిపడుతున్నారు. మీ కాన్సెప్ట్ హిట్ అవ్వాలి అనుకుని ఉంటే నువ్వు తీసుకున్న నిర్ణయాలే ఫైనలైజ్ చేసుకోవాలి.. జాన్విని ఈ ప్రాజెక్టులో చూస్ చేసుకొని తప్పు చేశావు బ్రో అంటున్నారు అభిమానులు . చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..??