అప్పుడే జాన్వీ తో అలాంటి పని చేస్తున్న చరణ్.. ఫోటోలు వైరల్..!!

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే రామ్ చరణ్ – జాన్వి పేర్లే మారుమ్రోగిపోతున్నాయి . ఒకప్పుడు శ్రీదేవి – చిరంజీవి జంట ఎంత అద్భుతంగా తెరపై కనిపించిందో మరోసారి అదే విజువల్స్ ను స్క్రీన్ పై చూపించబోతున్నారు చరణ్ – జాన్వి అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అందరూ అనుకున్న విధంగానే జాన్వి కపూర్ -చరణ్ కలిసి సినిమాలో నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది .

పూజా కార్యక్రమాలు కూడా పూర్తయిపోయాయి . అయితే జాన్వీ కపూర్ చరణ్ ని మీట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం కానీ .. ఆమె చాలా సరదాగా జోవియల్ గా మూవ్ అయింది . అంతేకాదు జాన్వి కపూర్ -చరణ్ తో సరదాగా ఏదో డిస్కస్ చేస్తున్న ఫొటోస్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి. రామ్ చరణ్ ఎదో మాట్లాడుతూ ఉంటే జాన్వి చాలా శ్రద్ధగా వింటున్నట్లు ఉంటుంది . చరణ్ ఇంట్లోనే నిన్న సాయంత్రం జాన్వి కపూర్ బుచ్చిబాబు సనా దీని గురించి మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తుంది .

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి వర్క్ షాప్ కూడా పెడతారట . జాన్వి చరణ్ డిస్కషన్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. ఈ జంట భలే క్యూట్ గా ఉంది అంటున్నారు అభిమానులు. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ మొదటి సినిమా ధడక్ తో మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది . కానీ ఎందుకో పెద్దగా హిట్ అవ్వలేదు . బాలీవుడ్ లో పలు సినిమాలో నటించిన ఆ క్రేజీ స్థానాన్ని మాత్రం అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ . జాన్వి కపూర్ తెలుగులో దేవర సినిమాతో డెబ్యూ ఇవ్వబోతుంది. చూద్దాం జాన్వి కపూర్ కి తెలుగు ఇండస్ట్రీ ఎలాంటి సక్సెస్ ఇస్తుందో..??