“అక్కినేని ఫ్యామిలీలో బిగ్ ఫంక్షన్”.. అభిమానులకి గుడ్ న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . త్వరలోనే అక్కినేని ఫ్యామిలీ ఇంట బిగ్ ఫంక్షన్ జరగబోతుందంటే..? యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రీసెంట్గా అక్కినేని హీరో నాగార్జున భారీ బంగ్లాను కొనుగోలు చేశారట . అంతేకాదు నాగచైతన్య డివర్స్ తర్వాత ఇంట్లో ఒక్క శుభకార్యం కూడా జరగలేదు . ఆ కారణం చేతనే అక్కినేని నాగార్జున తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఒక ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోబోతున్నారట .

కొత్త బంగ్లా కొన్న సందర్భంగా అక్కినేని నాగార్జున ఇంట్లో పూజ జరిపించి.. అందరికీ బిగ్ పార్టీ ఇవ్వబోతున్నారట . ఈ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు బాలీవుడ్ ఫ్రెండ్స్ కూడా అటెండ్ కాబోతున్నారట . అంతేకాదు ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ టబు కూడా అటెండ్ కాబోతుంది అంటూ ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఇకనైనా అక్కినేని ఫ్యామిలీకి అంతా మంచే జరగాలి అంటూ కోరుకుంటున్నారు అక్కినేని అభిమానులు.

కాగా ప్రెసెంట్ నాగార్జున మంచి మంచి సినిమాలో నటించడానికి వెయిట్ చేస్తూ ఉంటే.. నాగచైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా షూట్లో బిజీగా ఉన్నాడు . అక్కినేని అఖిల్ ఏమి చేయాలో అని ఆలోచిస్తూ ఉన్నాడు . తొందరపడి అది ఇది చేసేయడం అక్కినేని అఖిల్ ఇష్టం ఉండదు ఆ కారణంగానే టైం ఎక్కువ తీసుకుంటున్నాడు..!!