అస‌లు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ వ‌య‌స్సు ఎంత‌… ఆమె క‌ల ఎందుకు చెదిరింది…!

కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాల్లో కంటెంట్ ఉంటేనే నటించే ఈ ముద్దుగుమ్మ తను నటించే ప్రతి సినిమాతో తెలుగులో సక్సెస్ అందుకుంటుంది. ఈ క్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ సినిమాలో నటిస్తుందంటే ఆ సినిమా ఖచ్చితంగా ఏదో స్పెషల్ ఉంటుందని.. ఖ‌చ్చితంగా కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు నమ్మే రేంజ్‌కు ఆమె ఎదిగింది. కాగా ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

MeToo: Many Heroines Are Lying - Varalakshmi

ఈ ఎంగేజ్మెంట్ తరువాత ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది వరలక్ష్మి. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. అనుకున్నవన్నీ జరగవు. అదే జీవితం అంటూ చెప్పుకొచ్చింది. సినీ కెరీర్‌లో అయినా.. పర్సనల్ లైఫ్ లో అయినా నేను చాలా అనుకున్నాను.. కానీ ఏది వర్కౌట్ కాలేదంటూ చెప్పుకొచ్చింది. సూపర్ హిట్ సినిమాలైనా బాయ్స్, ప్రేమించే సినిమాల్లో ఆమెకు హీరోయిన్గా నటించే ఛాన్స్ వచ్చిందని.. కానీ అప్పటికి ఆమె వయసు 18 ఏళ్లే కావడంతో తండ్రి శరత్ కుమార్ సలహాతో ఆ అవకాశాలను వదులుకుందని వివరించింది.

Sarathkumar regrets not helping daughter Varalaxmi during Podaa Podi. This  is why - India Today

ఇక 22 ఏళ్లకు హీరోయిన్గా మారిన‌ ఈమె హీరోయిన్గా తన లైఫ్ లో చాలా తక్కువ విజయాలనే సాధించింది. సక్సెస్ మాట ఏమో కానీ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో పై కన్నేసింది వరలక్ష్మి.. కెరీర్ స్టార్టింగ్‌లో 22 ఏళ్లకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. 28 ఏళ్లకే స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకోవాలని.. ఆ తర్వాత 32 ఏళ్లకు పెళ్లి చేసుకుని.. 34 ఏళ్లకు పిల్లలకు కన్నాలని లైఫ్ స్లాన్ చేసింద‌ట‌. కానీ అనుకున్నవేమి జరగకపోవడంతో ఆమె చాలా బాధపడిందట.

Varalaxmi Sarathkumar gets engaged to gallerist Nicholai Sachdev - The Hindu

ప్రస్తుతం 38 ఏళ్ల వయసు వచ్చిన వరలక్ష్మి తాజాగా ముంబై బిజినెస్ మాన్ నిక్వోలైజ్ సచ్ దేవ్‌తో పెళ్లికి రెడీ అయింది. త్వరలోనే వీరి మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఇక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ జనరేషన్‌కి ఉపయోగపడే ఒక మంచి సలహా ఇచ్చింది. జీవితాన్ని ప్లాన్ చేసుకోకూడదు.. లైఫ్ ఎటు తీసుకువెళ్తే అటు వెళ్ళాలి.. సంతృప్తిగా పనిచేయాలి అంటూ వివరించింది. ప్రస్తుత వరలక్ష్మి చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి.