అయ్యయ్యో.. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్‌కి మన స్టార్ హీరో ఏకంగా రెండుసార్లు హ్యాండ్ ఇచ్చాడా.. అతనెవరంటే..?!

తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌కు ప్రేక్షకులలో ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెర‌కెక్కించే ప్రతి సినిమాతో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ను ప్రేక్షకులుగా అందిస్తూ ఉంటాడు. అలాగే కచ్చితంగా మెసేజ్ ఓరియెంటెడ్ కంటెంట్ ఉంటుంది. అందుకే శంకర్ సినిమాలకు మిగతా డైరెక్టర్ సినిమాలకు అసలు పోలికే ఉండదు. ప్రేక్షకులు కూడా శంక‌ర్‌ సినిమాలను అదేవిధంగా ఆదరిస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో శంకర్‌తో సినిమాలు చేసే అవకాశం వస్తే బాగుండ‌ని స్టార్ హీరో, హీరోయిన్లు ఎంతో మంది ఆశపడుతూ ఉంటారు. ఆ అవకాశం వస్తే వదులుకోకుండా ఖ‌చ్చితంగా నటించేందుకు చూస్తారు.

Gentleman Full Length Telugu Movie || Arjun, Madhubala, Subhashri - YouTube

అలాంటిది మన తెలుగు హీరో ఒకరు శంకర్ డైరెక్షన్‌లో సినిమా ఛాన్స్ వస్తే రెండుసార్లు రిజెక్ట్ చేశారట. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఎందుకు రిజెక్ట్ చేసారో ఒకసారి తెలుసుకుందాం. ఆ హీరో ఎవరో కాదు ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటూ తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న రాజశేఖర్. శంకర్ జెంటిల్‌మెన్ సినిమాను మొదట రాజశేఖర్‌తో తీయాలని భావించాడట. కానీ అది శంకర్‌కి మొదటి సినిమా కావడంతో.. రాజశేఖర్ తన మీద నమ్మకం లేక సినిమాను రిజెక్ట్ చేశాడట.

Telugu actor Rajasekhar meets with an accident: I have not sustained any  injuries - India Today

ఇక ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో అర్జున్ కెరీర్ పెద్ద మలుపు తిరిగింది. ఆయన టాప్ హీరో రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఈ సినిమా తర్వాత అర్జున్ న‌టించిన మరో మూవీ ఒకే ఒక్కడు సినిమా కోసం కూడా రాజశేఖర్‌నే మొద‌ట‌ అడిగాడట శంకర్. అయితే అప్పుడు కాల్ షీట్స్ కుదరకపోవడంతో.. పలు సినిమాల్లో బిజీగా ఉండి స్టోరీని వదిలేశాడు. ఇలా మొత్తానికి ఆ సినిమా ఛాన్స్ కూడా అర్జున్‌ కొట్టేసి సక్సెస్‌ఫుల్‌గా భారీ హీట్ ను అందుకున్నాడు. అయితే ఈ రెండు సినిమాల్లో రాజశేఖర్ చేసి ఉంటే ఆయన కెరీర్ మరో రేంజ్ లో ఉండేది అనడంలో సందేహం లేదు. ఇక‌ ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా ఫేడ్ అబుట్ అయిపోయాడు.

Oke Okkadu Movie (1999): Release Date, Cast, Ott, Review, Trailer, Story,  Box Office Collection – Filmibeat