దేవర విషయం లో ఎన్టీఆర్ కి మరో బిగ్ తలనొప్పి.. ఇలా దాపురించారు ఏంట్రా బాబు..!!

దేవర ..ఎన్టీఆర్ కెరియర్ లోనే ఎంతో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ . ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎంతో ఇష్టంగా కాన్ఫిడెంట్గా చేస్తున్న మూవీ కూడా ఇదే కావడం గమనార్హం. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సి ఉన్నింది. కానీ కొన్ని అనివార్య కారణాల చేత బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని దుష్ట శక్తులు గేమ్ ఆడటం కారణంగా ఎన్టీఆర్ దేవర దసరాకు పోస్టుపోనైంది .

అయితే ఇప్పుడు ఆ దసరా నుంచి కూడా ఏకంగా క్రిస్మస్ కి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయించే విధంగా కొత్త ప్లాన్స్ చేస్తున్నారు ఇండస్ట్రీ పెద్దలు అన్న విషయం ఎన్టీఆర్ అభిమానులకు కొత్త తలనొప్పి క్రియేట్ చేసేలా మారింది . ప్రభాస్ కల్కి సినిమా మే 9న రిలీజ్ అవ్వాలి .. కానీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ సినిమాను ఆగస్టు 15 పోస్ట్ పోన్ చేస్తున్నారట. ఆగస్టు 15 ఆల్రెడీ పుష్ప రాజ్ డేట్ లాక్ చేసుకుని ఉన్నాడు .

అయితే ప్రభాస్ స్పెషల్ గా రిక్వెస్ట్ చేయడంతో పుష్పరాజ్ దసరాకి రావాలి అంటూ డిసైడ్ అయ్యారట . ఒకవేళ దసరాకి పుష్పరాజ్ వస్తే కచ్చితంగా దేవర సినిమా డిసెంబర్ 25 కి పోస్ట్ పోన్ అవ్వాల్సిందేనని అంటున్నారు సినీ విశ్లేషకులు . దీంతో ఎన్టీఆర్ ని తొక్కేస్తున్నారు అని.. ఎన్టీఆర్ కి అన్యాయం చేస్తున్నారు అని.. ఎన్టీఆర్ పాలిట శనిలాదాపరించారు కొందరు దుష్ట శక్తులు అంటూ నందమూరి ఫ్యాన్స్ మండిపడుతున్నారు . దేవర విషయంలో బిగ్ కన్ఫ్యూషన్ గా ఉంది అని.. దీనంతటికీ కారణం కొరటాల శివ మౌనం అంటూ మండిపడుతున్నారు..!!