చరణ్ సినిమాలో జాన్వీ హీరోయిన్ గా చూస్ చేసింది ఆ హీరోనేనా..? బయటపడ్డ టాప్ సీక్రేట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జాన్వి కపూర్ కి.. ఆ టాలీవుడ్ హీరో సపోర్ట్ చేస్తున్నాడా ..?అంటే ఎస్ అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . మనకు తెలిసిందే.. శ్రీదేవి ముద్దుల కూతురుగా జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన రాని గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అనగానే వచ్చేసింది .

దేవర సినిమా రిలీజ్ అవ్వకముందే చరణ్ లాంటి బడా హీరోతో అవకాశం అందుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ వచ్చింది . అయితే చరణ్ సినిమాలో మొదటగా హీరోయిన్గా వేరే బ్యూటీ ని అనుకున్నారట . కానీ మెగాస్టార్ చిరంజీవిని పట్టుబట్టి బుచ్చిబాబు సనాకు స్పెషల్ రిక్వెస్ట్ చేసి మరి జాన్వి కపూర్ ని ఈ సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకోమంటూ సజెస్ట్ చేశారట .

శ్రీదేవి – చిరంజీవి కాంబో ఎంత సూపర్ డూపర్ హిట్ అన్న విషయం మనకు తెలిసిందే. అలాంటిది ఆయన కొడుకు శ్రీదేవి కూతురు తెరపై కనిపిస్తే అభిమానులు ఆ జంటను అదే విధంగా లైక్ చేస్తారు అన్న స్ట్రాటజీతోనే చిరంజీవి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట . చూద్దాం మరి చరణ్ -జాన్వీల జంట తెరపై ఏమాత్రం అందుకుంటుందో అభిమానులకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంది అనేది.. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా పూర్తయ్యాయి . దీనికి సంబంధించిన పలు పిక్చర్స్ వీడియోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . పక్కపక్కనే జాన్వీ -చరణ్ ని చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంది అంటున్నారు చిరంజీవి – శ్రీదేవి అభిమానులు..!!