యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీ లీల ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. రోజు ఏం తింటుందంటే..?

టాలీవుడ్ యంగ్‌ బ్యూటీ శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వచ్చిన ధ‌మాకా సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన హీరోయిన్గా వరుస ఆఫర్లను అందుకుంటు సెన్సేషనల్ బ్యూటీగా పాపులర్ అయింది. ఈ ముద్దుగుమ్మ చేసిన రెండు సినిమాలతోనే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోల సరసన నటించే ఛాన్సులు కొట్టేసింది. త‌న‌ టాలెంట్ కు, నటనకు, ముఖ్యంగా ఆమె వేసే డాన్స్ స్టెప్పులకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. బ్యూటీ వేసే ఒక్కో స్టెప్పుకు మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ప్రమోషన్స్ ఈవెంట్లో ఈ విషయాన్ని స్వయంగా వివరించాడు.

అలాగే ఈ మూవీలో కుర్చీ మడత పెట్టి సాంగ్కు శ్రీ లీలా చేసిన స్టెప్పులు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. అతి తక్కువ టైంలోనే స్టార్ బ్యూటీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. అయితే ఆమె ఎప్పుడూ యంగ్ అండ్‌ స్లిమ్ గా కనిపిస్తూ ఫిజిక్ తో కుర్రాళ‌ను ఆకట్టుకుంటుంది. అయితే శ్రీ లీల ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో బాడీని ఎలా మెయింటైన్ చేస్తుందో ఫుడ్ డైటె తెలుసుకోవాల‌నే ఆశ‌క్తి చాలా మందిలో ఉంటుంది. అవేంటో ఒకసారి చూద్దాం. శ్రీ లీల తన ఫిజికల్, మెంటల్ హెల్త్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందట. దీనికోసం ఈ బ్యూటీ ప్రతిరోజు నైట్ 45 నిమిషాలు తప్పకుండా యోగా.. సినిమా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా వర్కౌట్లు మానదట‌.

వెయిట్ లిఫ్టింగ్, త్రెడ్ మిల్ రన్నింగ్ ఇలా ఏ ఒక్కటి కూడా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చేస్తుందని తెలుస్తోంది. మజిల్ స్టాండ్ కోసం బాడీ టోన్డ్‌గా ఉండేందుకు ఎక్కువ బెంజ్ ప్రాసెస్, డెడ్ లిఫ్ట్ లాంటివి చేస్తూ ఉంటుందట. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగుతుందట. ఫ్రూట్ జ్యూస్, వెజిటేబుల్స్ శాండ్‌విచ్.. ఏదైనా ఒక ఫ్రూట్ సలాడ్ తప్పక బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటుందట. మధ్యాహ్నం లంచ్.. సలాడ్, బ్రౌన్ రైస్, పప్పు, వెజీస్‌ లాంటివి తీసుకుంటుంది. సాయంత్రం కాఫీ, నైట్ వెజిటేబుల్ సూప్‌, సలాడ్ తింటుందట. బాడీ ఎక్కువగా డిహైడ్రేట్ గా ఉండేందుకు నిమ్మకాయ వాటర్ ఎక్కువగా తీసుకుంటుంది ఈ చిన్నది.