మహేష్ సూపర్ స్టార్ అవ్వడానికి మెగాస్టార్ ఏ కారణమని తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రికి త‌గ్గ తనయుడిగా దూసుకుపోతున్నాడు మహేష్. తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న మహేష్.. గుణశేఖర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఒక్కడు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే ఈ సినిమా వేరే హీరోతో చేయాలని గుణశేఖర్ మొదట ప్లాన్ చేశాడట. మృగరాజు సినిమా షూటింగ్ టైంలో చిరంజీవి ఇచ్చిన సలహా మేరకు గుణశేఖర్ ఈ సినిమాని మహేష్ బాబుతో చేసినట్లు సమాచారం.

గుణశేఖర్ మృగ‌రాజు సినిమా షూటింగ్ టైంలో బ్రేక్ దొరికినప్పుడల్లా చిరంజీవి గారితో మాట్లాడుతుండేవాడట. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే అంటూ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌ లవ్ స్టోరీ అని చెప్పుకొచ్చాడట. కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్నగా కథను చెప్పి ఆ కథకు హీరోగా ఎవరైతే బాగుంటారు అని చిరంజీవిని అభిప్రాయం అడగగా.. మహేష్ బాబు అయితే ఈ సినిమాకు పర్ఫెక్ట్ గా ఉంటాడని అనుకుంటున్నా అంటూ సజెస్ట్ చేశాడట. నేను వేరే హీరో అనుకుంటున్నాను సార్ అని చెబితే.. మహేష్ బాబు అయితేనే ఈ సినిమాకు సెట్ అవుతాడని అనుకుంటున్నా అంటూ చిరు వివరించాడట.

దీంతో ఆలోచనలో పడ్డ గుణశేఖర్.. స్క్రిప్ట్ ని పూర్తి చేసిన తర్వాత చిరంజీవి సలహా మేరకు మహేష్ బాబు కి కథ వినిపించాడట. ఈ స్టోరీ మహేష్ బాబు కి కూడా నచ్చడంతో వీళ్లిద్దరు కాంబోలో సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తో మహేష్ బాబు ఒక్కసారిగా సూపర్ స్టార్ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. దీంతో ఒక్కడు సినిమా చిరంజీవి వల్లే మహేష్ బాబు వరకు వెళ్లిందని మహేష్ బాబు.. సూపర్ స్టార్ అవడానికి పరోక్షంగా మెగాస్టార్ ఏ కారణం అంటూ వార్తలు ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు.