” రామాయణం ” కోసం ‘ యానిమల్ ‘ ఏం చేస్తున్నాడో తెలుశా.. అంత‌లా కష్ట‌ప‌డుతున్నాడా..?!

గత రెండు, మూడు ఏళ్ళుగా బాలీవుడ్ రామాయణం గురించి వార్తలు వైర‌ల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం నితీష్ తివారి ఎంతో కాలంగా బిజీగా గడుతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ నీ రాముడిగా చూపించనున్నారు. ఈ ఏడాది లోనే సినిమా షూట్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాముడు పాత్రలో రణ్‌బీర్ కపూర్ కన్ఫర్మ్ అయినట్లు అధికారికంగా వార్తలు రాకపోయినా.. సోషల్ మీడియాలో ఈ వార్తలు తెగ్గ ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా యానిమల్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్న రణ్‌బీర్ తన నటన‌తో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. గత కొన్నాళ్లుగా రాముడు పాత్రకు రణ్‌బీర్ రెడీ అవుతున్నాడు. రాముడి బాడీ లాంగ్వేజ్ పై ప్రాక్టీస్ చేయడంతో పాటు.. డైలాగ్ డెలివరీ మరియు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా అనే విషయాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రతి రామాయణ కథాంశం సినిమాల నుంచి సీరియల్ నుంచి రాముడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనే అంశాన్ని కూడా రణ్‌బీర్ కపూర్ తెలుసుకొని ఆ సినిమా కోసం సిద్ధమవుతున్నాడట. భాషతో పాటు ప్రతి విషయంలో కూడా రెడీ అవుతున్నాడ‌ని టాక్.

రామాయణం పూర్తి అయినంత కాలం రణబీర్ కపూర్ మరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను వరుసగా రెండు మూడు సిరీస్ ల రూపంలో 2030 వరకు రిలీజ్ చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా నుంచి వస్తున్న సమాచారం. యానిమల్ తో హిట్ కొట్టిన రణ్‌బీర్ రాముని పాత్రలో నటించడం కోసం ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ కష్టపడుతున్నాడని తెలియడంతో.. ఆయనకు నటనలో ఉన్న డెడికేషన్ కారణంగానే ఇంతలా సక్సెస్ అవుతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.