ఓరి దేవుడోయ్..ఆఖరికి కుక్క కూడా నా..? అనసూయ షాకింగ్ వీడియో వైరల్..!!

తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ కొన్ని కొన్ని సార్లు అనసూయ పోస్ట్ చేసే వీడియోస్ సోషల్ మీడియాలో ఆమెను ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనేలా చేస్తూ ఉంటాయి. అనసూయ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే . జబర్దస్త్ షో ద్వారా మరింత స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఆమె ఈ షో నుంచి తప్పుకుంది .

కాగా ఆ తర్వాత సినిమాలలో బిజీగా ముందుకు దూసుకెళ్తుంది. రీసెంట్గా అనసూయ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక స్పెషల్ వీడియోని షేర్ చేసుకుంది. అనసూయ జిమ్లో వర్క అవుట్స్ చేస్తూ ఉంటున్న విషయం తెలిసిందే. రీసెంట్గా తన ఇంట్లో వ్యాయామాలు చేస్తున్న వీడియోకి సంబంధించిన పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అనసూయ వర్కౌట్స్ చేస్తూ ఉండగా ఆమె పెట్ డాగ్ మధ్యలోకి అడ్డు వస్తుంది .

దీంతో అనసూయ ఆ పెట్ డాగ్ ని బుజ్జగిస్తూ ..ముద్దులాడుతూ ..హగ్ చేసుకుంటూ కనిపిస్తుంది. అయితే ఆ పెట్ డాగ్ మాత్రం అనసూయను హగ్ చేసుకొనివ్వకుండా వెనక్కి వెళ్ళిపోతుంది . ఈ వీడియోకి ఒక నాటి ఆడియోను కూడా జోడించింది. ఆ ఆడియో మ్యూజిక్ కొంచెం వినడానికి ఇబ్బందికరంగానే ఉంది . దీంతో నెటిజన్స్ మరోసారి అనసూయను ఆడేసుకుంటున్నారు. నువ్వు పెట్టే పోస్టులు… నువ్వు పెట్టే మ్యూజిక్ లు ఇలా ఉండొచ్చు కానీ, మేము కామెంట్ చేస్తే తప్పా..? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరొక నెటిజన్ ఆఖరికి కుక్కని కూడా వదలట్లేదే అంటూ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@anasuyaholic)