నాగచైతన్య బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో ఛాన్స్ కొట్టేసిన సమంత.. ఏ మూవీ అంటే..?

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ కపుల్ గా భారి పాపులారిటీ దక్కించుకున్న సమంత, అక్కినేని నాగచైతన్య ఏవో మనస్పర్ధలతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి విడాకులకు కారణం ఇదే అంటూ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలలో యాక్ట్‌ చేయడమే అంటూ.. అమల – సమంతను వేధించడం కారణంగానే విడాకులు ఇచ్చిందంటూ ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకున్న ఈ జంట డివోర్స్ తర్వాత ఎవరి లైఫ్ లో వారు బిజీగా గ‌డుతున్నారు. అయితే మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచారు. నాగచైతన్య నటించిన దూత బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన సంగ‌తి తెలిసిందు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా ఇందులో సమంతను తీసుకుంటే మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని దర్శకుడు ఒప్పించాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. నిజంగా వీరిద్దరూ కలిస్తే చూడాలని ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే నాగచైతన్య, సమంతలకు ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉందని.. సమంత పేరు ఎత్తగానే నాగచైతన్య ప్రశంసలు కురిపిస్తాడు.. అలాగే నాగచైతన్య పేరు ఎత్తగానే శ్యామ్ కళ్ళ‌లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.