క్యూట్ స్మెల్తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో త్రో బ్యాక్ థీమ్ తో చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్ల, సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వారి అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలను చూడడానికి ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతూనే ఉంటారు. తమ ఫేవరెట్ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటో బయటకు వచ్చిందంటే దానిని తెగ వైరల్ చేస్తూ ట్రెండ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మరో సౌత్ స్టార్ బ్యూటీ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక‌ ఈ పై ఫోటోలో క్యూట్ స్మైల్ ఇస్తూ తన చెల్లిని ఎత్తుకొని స్టిల్స్ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..? మొదట మలయాళం ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది.

తర్వాత టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. నాచురల్ బ్యూటీగా క్రిజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. యాంటీ గ్లామరస్ లుక్ లో కనిపిస్తూ ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ చిన్న‌ది.. టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ గా బిరుదు అందుకుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..? మీరు అనుకున్నది నిజమే.. ఆమె సాయి పల్లవి. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో తన నటన.. తెలంగాణ యాస్ తో అందరినీ ఆకట్టుకుంది.

కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లోను అవకాశాలు దక్కించుకుంటూ క్రేజ్ ను పెంచుకుంటుంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇటీవల మళ్లీ రీ ఎంట్రీ కి సిద్ధమయ్యింది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నాగచైతన్య హీరోగా వస్తున్న‌ తాండల్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ రామాయణం లోను సీత పాత్రకు సాయి పల్లవి సెలెక్ట్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ లోనూ పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది ఈ నేచురల్ బ్యూటీ. ఇక తాజాగా ఈమె చెల్లి పూజా కన్నా ఎంగేజ్మెంట్ వేడుకలు ఘనంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.