స్టార్ట్ డైరెక్టర్ శంకర్ ఇంట్లో మొగునన్న పెళ్లి భాజాలు.. కూతురి ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్.. వరుడు ఎవరంటే..

స్టార్ డైరెక్టర్ శంకర్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శంకర్.. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా డైరెక్టర్ శంకర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగ‌న్నునాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతుందట. ఈ విషయాన్ని శంకర్ రెండో కూతురు ప్రముఖ హీరోయిన్ అదితి శంకర్ తన సోషల్ మీడియా వేదికగా వివరించింది.

అలాగే ఐశ్వర్య ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు విషెస్ తెలియజేస్తున్నారు. ఇక శంకర్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఐశ్వర్య శంకర్ డాక్టర్ గా కొనసాగుతుంటే.. రెండో కూతురు అతిధి శంకర్ మాత్రం తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ హీరోయిన్గా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి కష్టపడుతుంది. ఐశ్వర్య కు 2021లో ప్రముఖ క్రికెటర్ రోహిత్ దామోదర్ తో వివాహం జరిగింది. మహాబలిపురంలో గ్రాండ్గా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

అయితే కొంతకాలానికి విభేదాలు కారణంతో వీరు విడిపోయారు. ఇక‌ మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ఐశ్వర్య తన తండ్రి దగ్గరే ఉంటుంది. ఇప్పుడు రెండోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న ఐశ్వర్య అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయన్‌తో నిశ్చితార్థం జరుపుకుంది. తరుణ్ కార్తికేయన్ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే కాదు.. సాంగ్ రైటర్, బ్యాక్గ్రౌండ్ సింగర్ కూడా. ఇక త్వరలో ఐశ్వర్య తరుణ్‌ మ్యారేజ్ డేట్ ను కూడా శంకర్ ఫ్యామిలీ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.