రష్మి గౌతమ్ అన్ని సీరియల్స్ లో నటించిందా.. బుల్లితెరకే ఫిక్స్ కావడానికి కారణం ఏంటంటే..?

బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా హాట్ యాంకర్ గా పాపులర్టి ద‌క్కించుకుంది రష్మీ. అయితే రేష్మి కెరీర్ స్టార్టింగ్ లో పలు సీరియల్స్ లో నటించిందని విషయం చాలామందికి తెలియదు. అంతేకాదు సినిమాల కంటే టీవీనే బెటర్ అని ఆమె నిర్ణయించుకోవడానికి కూడా ఆసక్తి గ‌ల కారణం ఉంది. దీనికి సంబంధించిన విషయాలను ఇటీవల రివీల్ చేసింది రష్మి. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి బుల్లితెర కామెడీ షోలకు యాంకర్ గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. తన అభినయంతో ఆకట్టుకుంటుంది. పదేళ్లుగా షోని సక్సెస్ ఫుల్గా రన్ చేయడంలో కీలక పాత్ర వహించిన ఈ హాట్ బ్యూటీ.. బుల్లితెరకే పరిమితం కావడానికి టీవీని నమ్ముకోవడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. యాంకర్ రష్మి కెరీర్ ప్రారంభంలో 2002 – 3 సంవత్సరాలలో థ్యాంక్స్ అనే సినిమాలో నటించింది. ఇందులో హీరోయిన్గా రొమాన్స్ తో రెచ్చిపోయింది. గ్లామ‌ర్ ట్రీట్ అప్పట్లోనే వేరే లెవెల్ లో చేసిన ఈ బ్యూటీ.. ఇటీవల యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని వివరించింది.

ఆమె సినిమా ఇప్పటికీ యూట్యూబ్లో స్టీమ్ అవుతుందట. అయితే ఈ సందర్భంగా పలు ఇంట్రస్టింగ్ విషయాలను వివరించింది. రష్మీ మొదట్లో పలు సీరియల్స్ లో, థాంక్స్ లాంటి రొమాంటిక్ సినిమాలో నటించిన ఆమెకు పెద్దగా క్రేజ్ రాలేదని.. పైగా అందులో పాత్రల కారణంగా తనపై ఎన్నో ట్రోల్స్, విమర్శలు వినిపించాయని.. ఆఫర్లు కూడా రాలేదంటూ వివరించింది. దాంతో ఆమె ఇంటికి వెళ్ళిపోయిందట. ఆ తర్వాత మళ్లీ కొంత గ్యాప్ తో ఎంట్రీ ఇచ్చి యువ అనే సీరియల్ లో నటించే ఆఫర్ అందుకుంది. అందులో స్వాతి అనే పాత్రలో కనిపించిన రష్మీ రొమాన్స్ ని ఎక్కువగా ఇష్టపడే మహిళగా.. మగ రాయుడులా ఫీల్ అవుతూ కనిపిస్తుంది. ఏపనైనా బ్రహ్మాండంగా ప్రారంభించే రష్మి చివరకు తుస్తుమనిపిస్తుందట. అలా ఓ క్రేజి పాత్రలో రష్మీ నటించి మెప్పించంది. కామెడీ ప్రధానంగా సాగే ఈ సీరియల్ మాటీవీలో ప్రసారమయ్యేదని వివరించింది. ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్న చాలామంది అందులో నటించడం గమనార్హం.

అయితే లవ్ అనే మరో సీరియల్ కూడా మాటీవీలోనే ప్రసారమైంది. దీంతో మంచి ఆదరణ లభించింది.. రష్మీకి మళ్ళీ కొన్ని సీరియల్, సినిమాల ఆఫర్లు వచ్చాయట. అలా కరెంట్, ఎవరైనా ఎప్పుడైనా, గణేష్, బిందాస్, ప్రస్థానం లాంటి సినిమాల్లో నటించింది. దీంతో పాటు తమిళ్, హిందీ, కన్నడ లోనూ రష్మీ మెరిసింది. ఈ క్రమంలో జబర్దస్త్ లో యాంకర్ గా ఆఫర్ వచ్చిందట. అయితే సినిమాల్లో కొంత బోల్డ్ రోల్స్ కావడంతో విమర్శలు ఎదుర్కొన్న రష్మీ బుల్లితెరపై షోలలో చేయడమే చాలా బెటర్ అనుకుందట. ఆ తర్వాత ఆమె పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. అయితే గుంటూరు కారం టాకీస్ మంచి పేరు తెచ్చిన.. ఆమెకు సరైన ఆఫర్లు రాలేదు. ఇక త‌ర్వాత‌ జబర్దస్త్ ఆమెకి స్టార్ యాంకర్ ఇమేజ్ ని తెచ్చి పెట్టింది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవల కాలంలో మళ్ళీ సినిమా ప్రయత్నాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. బోళా శంకర్ లో ఐటెం గర్ల గా మెప్పించింది. ఇప్పటికీ ఆమె గ్లామర్ పాత్రలు, ఐటమ్ సాంగ్లు చేసేందుకు సిద్ధంగా ఉంది. మరి మేకర్స్ ర‌ష్మి టాలెంట్ ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాలి.