ఫ్యాన్స్ కి మరో బిగ్ గుడ్ న్యూస్..తండ్రి కాబోతున్న సమంత జాన్ జిగిడి హీరో..!

బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ ధావన్ అభిమానులకు చెప్పిన గుడ్ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ కు నిద్ర పట్టడం లేదు . వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఆ గుడ్ న్యూస్ కి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చేసింది . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో వరుణ్ ధావన్ తండ్రి కాబోతున్నాడు ఆయన వైఫ్ ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరిగింది . కానీ వరుణ్ ధావన్ మాత్రం ఎప్పుడు ఆ విషయాన్ని బయట పెట్టలేదు. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆయన తండ్రి కాబోతున్న విషయాన్ని బయట పెట్టాడు .

“మేము పేరెంట్స్ కాబోతున్నాం. మీ అందరి ప్రేమ ఆశీస్సులు మాపై ఉండాలి” అంటూ స్పెషల్గా నోట్ చేశాడు వరుణ్ దావణ్. అంతేకాదు తన భార్య బేబీ బంప్ ఫోటోను ముద్దు పెడుతున్న పిక్చర్ ని కూడా షేర్ చేశారు . సోషల్ మీడియాలో ఈ పిక్చర్ బాగా ట్రెండ్ అవుతుంది. పలువురు స్టార్ సెలబ్రిటీస్ ఆయనకు విషెస్ అందిస్తున్నారు. హీరోయిన్ సమంత – జాన్వి కపూర్ – మౌని రాయి లాంటి వాళ్ళు స్పెషల్గా విషెస్ అందించారు .

కాగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వరుణ్ ధావన్ మూడేళ్ల క్రితం ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి . కాగా సమంత నటించిన సిటాడిల్ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్లో ప్రమోషన్స్ లో భాగంగా దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి . ఇప్పుడు వరుణ్ ధావన్ తండ్రి కాబోతున్నాడు అని తెలిసి సమంత పెట్టిన రిప్లై కూడా ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!!

 

 

View this post on Instagram

 

A post shared by VarunDhawan (@varundvn)