పెళ్లి తర్వాత నాలో వచ్చిన మార్పులు ఇవే.. స్వేచ్ఛ కోల్పోయా.. మెగా హీరో సెన్సేషనల్ కామెంట్స్..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఐదేళ్లుగా ప్రేమించి లావాణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మిస్టర్ మూవీలో వీళ్లిద్దరూ కలిసి నటించారు. ఈ పరిచయం కాస్తగా ప్రేమగా మారడంతో కొన్ని నెలల తర్వాత గతేడాది నవంబర్లో జీవితంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి వివాహం ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా హీరోస్ అందరూ ఈ పెళ్లిలో సందడి చేయడంతో ఇది నేషనల్ న్యూస్‌గా మారింది. అయితే మొదటిసారి పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉందనే అంశంపై వరుణ్ తేజ్ మాట్లాడాడు. వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్‌ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ లో సందడి చేస్తున్న వరుణ్.. యాంకర్ సుమ పెళ్లి అనంతరం మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి అంటూ ప్రశ్నించింది సుమ.

ఈ ప్రశ్నకు వరుణ్ ఫన్నీగా సమాధానం చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి ఎక్కడికి వెళ్లినా పదేపదే ఎక్కడికి వెళ్తున్నావ్ అనే ప్రశ్న ఎదురవుతుంది అంటూ వివరించాడు. అయితే వరుణ్ తేజ్ చెప్పిన సమాధానాన్ని బట్టి లావణ్య ఆయనకు కాస్త ఇబ్బంది కల్పిస్తుందని.. వరుణ్ తేజ్ తన సొంత విషయాల్లో స్వేచ్ఛ కోల్పోయాడని అర్థమవుతుంది. భార్య అంటే ఇవన్నీ కామన్ గా జరుగుతూ ఉంటాయి. షర్ట్ వేసుకుంటే ఎక్కడికి వెళ్తున్నావ్ అనడం.. గంటకు కాల్ రావడం అందరు భర్తల్లాగే వరుణ్ తేజ్‌కి కూడా కామన్ గా అయిపోయిందని అర్థమవుతుంది. వరుణ్ తేజ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

Operation Valentine | Official Hindi Teaser | Varun Tej, Manushi Chhillar|  In Cinemas 1st March 2024 - YouTube

చిరంజీవి తనకు స్ఫూర్తి అంటూ వివరించాడు. పవన్ కళ్యాణ్ బాబాయిలో నిజాయితీ నచ్చుతుందని చెప్పుకొచ్చాడు. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఒప్పుకోక ముందు పోల్వమా ఘటనపై నాకు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు పూర్తిగా ఆ సంఘటన గురించి అర్థమైంది అంటూ వరుణ్ తేజ్ వివరించాడు. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ ఆపరేషన్ వాలంటైన్ సినిమాని అద్భుతంగా తెర‌కెక్కించారని వివరించాడు. ఇక వరుణ్ కి జంటగా మానుషి చిల్లర కనిపించనుంది. భారత వైమానిక దళాల సాహసాలు ప్రధానంగా ఆపరేషన్ వాలంటైన్ రూపొందింది. మార్చి 1 న ఈ సినిమా రిలీజ్ కానుంది.