రామ్ చరణ్ రికార్డులను సునాయాసంగా బ్రేక్ చేసిన విజయ్ దేవరకొండ.. రౌడీ హీరో మామూలోడు కాదుగా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లో ఎన్నో సంచలన రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చ‌ర‌ణ్‌ రెండో సినిమా మగధీరతోనే బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రియల్ హిట్ సాధించి చరిత్ర సృష్టించాడు. మగధీర మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై ఉంటే సులువుగా రూ.250 నుంచి 300 కోట్ల రేంజ్ కలెక్షన్లను సాధించేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హిట్లు, ఫ్లాపులతో సంభందం లేకుండా దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటూ క్రేజ్ మరింత పెంచుకుంటున్నాడు.

Vijay Devarakonda : రామ్ చరణ్ రికార్డ్ ను సులువుగా బ్రేక్ చేసిన విజయ్  దేవరకొండ.. ఈ రౌడీ హీరో మామూలోడు కాదంటూ - Vijay Devarakonda Breaks Ram Charan  Instagram Followers Record Details

ఇక తాజాగా విజయ్ దేవరకొండ.. రామ్ చరణ్ రికార్డును సునాయాసంగా బ్రేక్ చేసి వార్తల్లో వైరల్ అవుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ విషయంలో విజయ్ దేవరకొండ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం రౌడీ హీరో ఇన్‌స్టాగ్రామ్ పాలవర్ల సంఖ్య‌ 21 మిలియన్లుగా ఉంది. కాగా రామ్ చరణ్ తాజాగా 20 మిలియన్ మార్క్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చేరుకోగా అలవోకగా విజయ్ దేవరకొండ ఈ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ రౌడీ హీరో మామూలోడు కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక గత కొంతకాలంగా వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న విజయ్ దేవరకొండను అభిమానించేవారి సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతుంది.

Vijay Devarakonda : రామ్ చరణ్ రికార్డ్ ను సులువుగా బ్రేక్ చేసిన విజయ్  దేవరకొండ.. ఈ రౌడీ హీరో మామూలోడు కాదంటూ - Vijay Devarakonda Breaks Ram Charan  Instagram Followers Record Details

ఇక ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు రౌడీ హీరో. ఈ సినిమా వేసవి సెలవుల్లో రిలీజ్ అవుతుండ‌గా.. ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ సినిమాతో విజయ్‌ తన కెరీర్ బెస్ట్ హిట్ను అందుకుంటాడంటూ అభిమానులు తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండానే విజయ్ పారితోషకం కూడా భారీ రేంజ్ లో పెరుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ ను అందుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు.